ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు
on Nov 25, 2016

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంటీ అని అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం చర్చించుకుంటోంది. ఎన్టీఆర్ సినిమా అతనితోనే అంటూ రోజుకొక కొత్త డైరెక్టర్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. మొన్నా మధ్య సూర్యతో సింగం సిరీస్ తీస్తున్న తమిళ స్టార్ డైరెక్టర్ హరితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి..ఇందులో ఎన్టీఆర్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని పుకార్లు షికారు చేశాయి.
దీనిపై ఇంత కథ నడుస్తుంటే అసలు ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదంటూ షాకిచ్చాడు డైరెక్టర్ హరి. సింగం-3 ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు హరి. ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. నిజమేనా..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు..అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి తనకు తెలియదని, తననెప్పుడూ కలవలేదని కామెంట్ చేశాడు. దాంతో పాటే తన నెక్ట్స్ మూవీ విక్రమ్‌తో ఉంటుందని ప్రకటించేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



