బాలకృష్ణ అదృష్ణవంతుడు
on Dec 26, 2016
.jpg)
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటించిన బాలకృష్ణ నిజంగా అదృష్టవంతుడన్నారు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలోని నెహ్రూ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం..ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తూ తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అన్నారు. రాజులెందరున్నా..గౌతమిపుత్ర శాతకర్ణి ప్రత్యేకమైన వ్యక్తి అన్నారు. తల్లి లేదా మహిళకు గౌరవమివ్వాలని చరిత్రలో మొట్టమొదటిసారి తెలిపిన వ్యక్తి శాతకర్ణి అన్నారు. లెజెండ్ సినిమాయే వెయ్యి రోజులు ఆడితే..మరి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకెన్ని రోజులు ఆడుతుందోనన్నారు. క్రిష్, బాలకృష్ణ ఈ సినిమాకు ఎంతో శ్రమించారని అన్నారు. వారందరికీ శుభాభినందలని..ఈ సినిమాను తెలుగు జాతి చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



