'నా ఫ్రెండ్‌దేమో పెళ్లి.. నాకేందిర ఈ లొల్లి' అంటున్న జయతి!
on May 17, 2023

ఒకప్పుడు వీడియో జాకీగా పాపులారిటీ సంపాదించుకొని, 'లచ్చి' సినిమాతో హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇచ్చిన జయతి, కొంత విరామంతో ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అనే మ్యూజిక్ వీడియో సాంగ్‌తో మన ముందుకొచ్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. శ్రావణ భార్గవి పాడిన ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ సమకూర్చారు.
గ్రూప్ డ్యాన్సర్లతో కలిసి జయతి చేసిన డ్యాన్సులు, పాటలోని సాహిత్యానికి తగ్గట్లుగా ఆమె ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. కాస్ట్యూమ్స్ విషయంలోనూ ఆమె చాలా శ్రద్ధ చూపించారు. నివృతి వైబ్స్ ద్వారా ఈ పాటను రిలీజ్ చేశారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం ఈ వీడియో సాంగ్‌ను యాక్టర్ జె.డి. చక్రవర్తి ఆవిష్కరించారు.
ఈ మధ్య కాలంలో తన సంగీతంతో అద్భుతమైన పాటలను అందిస్తూ వస్తోన్న భీమ్స్ మరోసారి తన బాణీలతో మెస్మరైజ్ చేశారు. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. జయతి విజన్స్ సమర్పణలో శ్రీకోనేటి ఈ పాటను డైరెక్ట్ చేశారు.
పాట చాలా బాగుందనీ, జయతి చాలా అందంగా కనిపించడంతో పాటు బాగా డ్యాన్స్ చేసిందనీ జె.డి. చక్రవర్తి ప్రశంసించారు. జబర్దస్త్ రాంప్రసాద్, డాన్సర్-యాక్టర్ అక్సా ఖాన్, కొరియోగ్రాఫర్ స్రస్టి వర్మ, నిర్మాత సురేశ్ కొండేటి కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని జయతిని అభినందించారు.
2024 పూర్తయ్యేసరికి 150 పైచిలుకు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నివృతి వైబ్స్ సంస్థ తెలియజేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



