టీజర్ రివ్యూ: జయ జానకీ నాయక
on Jul 21, 2017
.jpg)
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంభినేషన్‌లో జయ జానకీ నాయక మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ ఈవెంట్స్‌లో స్పీడు పెంచింది. కొద్ది రోజుల క్రితం వదిలిన ఫస్ట్ టీజర్‌లో తన రెగ్యులర్ సినిమాల్లా ఎక్కడా మాస్ ఛాయలు మచ్చుకైనా కనిపించకుండా తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టాడు బోయపాటి..పూర్తి క్లాస్ టచ్‌తో ఆ టైటిల్ ఫ్యామిలీ ఆడియాన్స్‌ని ఆకట్టుకుంది. అయితే లేటెస్ట్‌గా వదిలిన రెండో టీజర్లో మాత్రం తన అసలు సిసలు అస్త్రాన్ని వదిలాడు బోయపాటి. ఫైట్లు, కత్తులు, సుమోలతో హీరో బెల్లంకొండ శ్రీను హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. లైఫ్‌లో కష్టమొచ్చిన ప్రతీసారి లైఫ్‌ని వదులుకోం, కానీ ప్రేమని వదిలేస్తాం.. కానీ నేను వదలను' అంటూ బెల్లంకొండ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌కు థియేటర్లో కేకలు గ్యారెంటీ. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా..జగపతిబాబు, శరత్ కుమార్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



