చరణ్ ని కలిసిన జపాన్ మహిళా ఫ్యాన్స్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా!
on Dec 8, 2025

-జపాన్ మహిళా ఫ్యాన్స్ ఆనందం
-చరణ్ తో ఫోటోలు
-అభిమానానికి ముగ్దుడైన చరణ్
-పెద్ది తో సత్తా చాటడానికి రెడీ
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)కి ఉన్న అభిమాన ఘనం అపారం. ఆ అభిమానాన్ని ఏ స్థాయిలో చూపిస్తారో అనే విషయం రామ్ చరణ్ బర్త్ డే రోజుతో పాటు సినిమా రిలీజ్ రోజు అర్ధమవుతుంది. చరణ్ కూడా అభిమానుల పట్ల ఎప్పుడు కృతజ్నతా భావంతో ఉంటాడు. ఇక చరణ్ రేంజ్ 'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసేలా ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
రీసెంట్ గా జపాన్(Japan)దేశం నుంచి ఐదుగురు మహిళా అభిమానులు చరణ్ ని కలవడం కోసం హైదరాబాద్(Hyderabad)లోని చరణ్ నివాసానికి వచ్చారు. ఆ అందరు చరణ్ అప్ కమింగ్ మూవీ 'పెద్ది' నుంచి ఇప్పటి వరకు చరణ్ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లోని స్టిల్స్ అన్నిటిని ఒక చోటున ఉంచి గ్రీటింగ్ లాగా చేసుకొని వచ్చారు. దీంతో వాళ్ళ అభిమానానికి చరణ్ ముగ్దుడయ్యాడు. ఆ అందరితో ఫోటోలు దిగడమే కాకుండా క్రికెట్ బ్యాట్స్ పైన తన సంతకం చేసి వాళ్ళకి అందించాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read: అధ్యక్షఎన్నికల్లో జానీ మాస్టర్ విజయం..సృష్టి వర్మకి షాక్!
పెద్ది విషయానికి వస్తే అభిమానులకి ఈ సారి పెద్ది(Peddi)తో మంచి ట్రీట్ ఇవ్వాలనే పట్టుదలతో చరణ్ ఉన్నాడు. అందుకు తగ్గట్టే శరవేగంగా చిత్రీకరణలో పాల్గొంటూ నెక్స్ట్ ఇయర్ మార్చి 26 న వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనున్నాడు. ప్రస్థుతానికి 'చికిరి' సాంగ్ తో పాటు సదరు సాంగ్ లో ప్రదర్శించిన స్టెప్స్ తో గ్లోబల్ స్థాయిలో టాక్ అఫ్ ది టౌన్ గా మారి తన సత్తా చాటుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



