
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నంబర్ 47’ విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 9న సినిమా విడుదల ఖాయమని నిర్మాత నాగవంశీ స్వయంగా ప్రకటించి మూడు రోజులు కూడా కాకముందే.. ఇప్పుడు మరోసారి వాయిదా వార్తలు తెరపైకి వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న రావడం లేదని, అక్టోబర్ 30న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అక్టోబర్ 30 తేదీపై నిర్మాతల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
నిజానికి కొద్దిరోజుల క్రితమే అక్టోబర్ 9 రిలీజ్‌పై అనుమానాలు వచ్చాయి. అయితే ఆ డౌట్స్ కు అక్టోబర్ 1న నాగవంశీ స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. ‘‘మా రిలీజ్ పంక్చువాలిటీ మీద మీకు డౌట్ ఉండొచ్చు.. కానీ ఈసారి అలాంటి డౌట్స్ ఏమీ వద్దు. అక్టోబర్ 9న వస్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అంతేకాదు.. అక్టోబర్ 6న ట్రైలర్ లాంచ్, అక్టోబర్ 7న రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని కూడా ప్రకటించారు. ప్రీమియర్స్ కూడా ఉండవని, అక్టోబర్ 9న నేరుగా థియేటర్లలో కలుద్దామని నాగవంశీ స్పష్టంగా చెప్పారు.
అయితే ఇప్పుడు పరిస్థితి మరోలా కనిపిస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే వాయిదాకు కారణమనే టాక్ వినిపిస్తోంది. క్వాలిటీ విషయంలో తొందరపడకుండా మరికొంత సమయం తీసుకోవాలని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు అక్టోబర్ 16 తేదీ కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆ తేదీకి ఇప్పటికే ‘జైలర్ 2’, ‘రణబాలి’ వంటి సినిమాలు బరిలో ఉన్నాయి. దీంతో అక్టోబర్ 30 వైపే టీమ్ మొగ్గు చూపుతున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ‘ఆదర్శ కుటుంబం’ ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది. మొదట సమ్మర్‌లో వస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం అక్టోబర్ 9కి మార్చారు. ఇప్పుడు మరోసారి డేట్ మారే పరిస్థితి కనిపించడంతో అభిమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: ఇది లైంగిక దాడితో సమానం.. జాన్వీ కపూర్ ఎమోషనల్.!
[Aadarsha Kutumbam Postponed Again, Aadarsha Kutumbam New Release Date, Aadarsha Kutumbam October 30 Release, Aadarsha Kutumbam Movie, Victory Venkatesh, Trivikram Srinivas, Naga Vamsi, Telugu Film News]
.webp)






