
అందని అందం, అంతే అందమైన నటన జాన్వీ కపూర్(janhvi kapoor)సొంతం. అతిలోక సుందరి శ్రీదేవికి పర్ఫెక్ట్ నట వారసురాలనే కితాబు కూడా అభిమానుల నుంచి అందుకుంటూ ప్రీవియస్ మూవీ పెద్దితో బ్లాక్ బస్టర్ అందుకొని తెలుగునాట లక్కీ హీరోయిన్ గా తిష్ట వేసింది.
ఈ వివాదాలన్నింటికీ చెక్ పెడుతూ జాన్వీ కపూర్ తాజాగా కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ది వివాదం, ఆ క్యారక్టర్ కి వచ్చిన ట్రోల్స్ నుంచి పూర్తిగా కోలుకున్న జాన్వీ, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఉమేష్ బిస్త్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక భారీ చిత్రంలో నటించనున్నట్టుగా టాక్.కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటిగా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ఈ సినిమా ద్వారా ఆమె సిద్ధమవుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఏక్తాకపూర్, గునీత్ మోంగా తెరకెక్కించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే అక్టోబర్, నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఉమేశ్ బిస్ట్ ది ట్రయల్, గ్యారహ్ ,గ్యారహ్ వెబ్ షోలని డైరెక్ట్ చేశాడు.
Also read: బిగ్ రిస్క్ లో బాలయ్య!
మరి ఉమేశ్ బిస్ట్ జాన్వీకపూర్ కోసం ఎలాంటి క్యారక్టర్ డిజైన్ చేశాడు. ఈ సినిమాతో అయినా జాన్వీకపూర్‌కు బ్రేక్ వస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.
janhvi kapoor, peddi, ram charan






