
అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని అందుకనే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సంచలన విజయాన్ని అందుకున్న చిత్రమే పొలిమేర పార్ట్ 1 ,పార్ట్ 2 ,. ఇప్పుడు మూడో భాగం తెరకెక్కనుంది. ఈ భాగంలో క్రేజీ హీరో జాయిన్ కాబోతున్నాడు. దీంతో మూడో పార్ట్ కి సరికొత్త జోష్ వచ్చినట్లయింది.
తెలుగు ప్రేక్షకులలో సుదీర్ఘ కాలంగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ రోల్ లో చేయబోతున్నారు. రీసెంట్ గా బ్లాస్ట్ జోన్ తో సక్సెస్ అందుకున్న అర్జున్ మూడవ భాగానికి తోడవ్వడం సినిమా రేంజ్‌ని కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళుతుందనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈసారి అర్జున్‌ని ఎలాంటి సరికొత్త షేడ్‌లో చూపిస్తారనే సస్పెన్స్ సినిమా లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ మూడవ భాగంలో చేతబడి, క్షుద్ర విద్యల బ్యాక్‌డ్రాప్‌తో పాటు, ప్రస్తుత సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒక 'బర్నింగ్ ఇష్యూ'ని టచ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదటి రెండు భాగాల కంటే దాదాపు 3 రెట్లు అధిక బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిమేర-2 చిత్రాన్ని విజయవంతంగా పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి, మొదటి భాగానికి నిర్మాతగా వ్యవహరించిన భోగేంద్ర గుప్తాతో కలిసి ఈ త్రీక్వెల్‌ను అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
also read: పెద్ది తర్వాత కొత్త సినిమాకి జాన్వీకపూర్ గ్రీన్ సిగ్నల్..!
ప్రముఖ నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్' కూడా ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి సపోర్ట్ అందిస్తుండటం విశేషం. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను, రాకేందు మౌళి వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది.







