Home

»

Latest News

janhvi kapoor: తెలుగులో మళ్ళీ అవకాశాలు వస్తాయా! అసలు చేస్తుందా!

Jun 8, 2026 10:45AM

 


బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్(janhvi kapoor)ప్రెజెంట్ అచ్చాయమ్మగా పెద్దితో కలిసి థియేటర్స్ లో సందడి చేస్తుంది. తాను ప్రేమించిన పెద్దికి ఒక కాలుపోయినా సరే ప్రేమ అయిన పెళ్లి అయిన ఒకరే అని తనంతట తానే మెడలో పెద్దితో పెళ్లి అయిపోయినట్టుగా తాళి కూడా కట్టుకుంటుంది. అదే టైంలో అచ్చాయమ్మ రోల్ లో గ్లామర్ డోస్ ఎక్కువయ్యిందనే విమర్శలని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లామర్ షో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక రేంజ్ వివాదానికి దారితీసింది. ఈ అందాల ప్రదర్శనపై నార్త్ మీడియా, అక్కడి సినిమా విమర్శకులు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కేవలం ఆమెను గ్లామర్ కోసమే వాడుకున్నారంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నార్త్ మీడియాకు చెందిన కొందరు క్రిటిక్స్ అయితే ఏకంగా లైంగిక దోపిడీ, 'డిస్‌గస్టింగ్' లాంటి ఘాటైన పదాలు వాడుతూ పెద్ది చిత్ర బృందాన్ని, సౌత్ మేకర్స్‌ని  విమర్శించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 


ఈ తీవ్ర విమర్శల మధ్యలోనే జాన్వీ కపూర్‌కి సంబంధించిన కొన్ని వ్యక్తిగత చాట్స్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపింది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ లీకైన చాట్స్‌లో జాన్వీ కపూర్ పెద్ది సినిమా షూటింగ్ సమయంలో కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక నిర్దిష్ట సీన్ లేదా సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కెమెరాను తప్పుగా, కాస్త ఇబ్బందికరమైన యాంగిల్స్‌లో సెట్ చేశారంటూ ఆమె తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఆ చాట్స్‌ ద్వారా తెలుస్తోంది.

 జాన్వీ హిందీ చిత్ర సీమలో 2018 లో ఎంట్రీ ఇచ్చింది. సుమారు 13 చిత్రాల వరకు చేసింది. కానీ సరైన బ్రేక్ రాలేదు. తెలుగులో మాత్రం ఎన్టీఆర్ దేవర తో హిట్ కొట్టింది. ఇప్పడు పెద్దితో మరో హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ లేవనెత్తుతున్న ప్రశ్నలకి, జాన్వీ పెద్దిపై చిట్ చాట్ చేసిందనే నేపథ్యంలో ఫ్యూచర్ లో తెలుగులో అవకాశాలు వస్తాయా లేదా, అసలు తను చేస్తుందా లేదా అనే ప్రశ్నలని సినీ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com