అవును.... ఎన్టీఆర్ భయపడ్డాడు
on Sep 14, 2016

తొలి రోజు జనతా గ్యారేజ్ టాక్.... చిత్రసీమని ఆందోళనలో పడేసింది. సెకండాఫ్ వీక్ అన్నారంతా. విలన్ లేడు.. ఇదేం సినిమా అని రివ్యూలు రాశారు. కథానాయికల పాత్రలో ఏమాత్రం బలం లేదని నిట్టూర్చారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు, ట్రేడ్ నిపుణులు నివ్వెరపోయారు. ఇదేంటి?? ఈ సినిమా కూడా ఫ్లాపేనా?? అనుకొన్నారు. ఆ భయం ఎన్టీఆర్‌కీ కలిగిందట. బెనిఫిట్ షో తర్వాత జనం రకరకాలుగా మాట్లాడడం చూసి షాకయ్యాడట. ఏంటి... కొరటాలపై నేను పెట్టుకొన్న నమ్మకం తప్పా?? ఈ కథని నమ్మడం తప్పా?? అని చాలా బాధపడ్డాడట. అయితే తొలిరోజు ముగిశాక పర్‌ఫెక్ట్ రిపోర్ట్ వచ్చిందని, అప్పుడు సంతోషంగా అనిపించిందని చెబుతున్నాడు. నిజానికి తొలి రోజు టాక్ చూస్తే జనతా ఈ రేంజులో వసూళ్లు సాధిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. యావరేజ్ గా నిలబడడమే గొప్ప అనుకొన్నారంతా. కానీ.. కనీవినీ ఎరుగని రేంజులో వసూళ్లు సాధించి ఎన్టీఆర్ కు వంద కోట్ల విజయాన్ని అందించింది. టాక్ చూసి భయపడ్డా అని చెప్పడం కూడా ... ఎన్టీఆర్ నిజాయతీకి నిదర్శనమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



