జనతా గ్యారేజ్ లో సచిన్ కీలక పాత్ర..!
on May 25, 2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ కు ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉంది. భారీ నటీనటవర్గం ఉంది. తాజాగా సినిమాలో సచిన్ నుతీసుకున్నారు మూవీ టీం. ఇదేంటి సచిన్ జనతా గ్యారేజ్ లో ఏం చేస్తాడబ్బా అని డౌట్ పడకండి. సినిమాలోకి తీసుకున్నది సచిన్ టెండూల్కర్ ను కాదులెండి. మరాఠీ నటుడు, బ్రదర్స్ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడు అయిన సచిన్ ఖేద్కర్ ను సినిమాలో కీలక పాత్రకోసం తీసుకున్నారు. విక్రమ్ కె కుమార్ తీసిన 13 బి సినిమాలో కూడా అతని పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. జనతా గ్యారేజ్ లో నెగటివ్ రోల్ ను ఆఫర్ చేశారని, ఆ పాత్ర తీరుతెన్నులు నచ్చడంతో, సచిన్ వెంటనే ఓకే చేశాడని మూవీ యూనిట్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ లాల్, ముకుందన్ లాంటి వాళ్లందరూ కీలక పాత్రలు చేస్తున్నారు. మరో నెలరోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడబోతున్నారు జనతా గ్యారేజ్ టీం. నిర్మాతలు ఇప్పటికే ఆగష్ట్ 12 న మూవీని రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



