జనతా గ్యారేజ్ కు వెళ్లిన దేవీ శ్రీ..!
on May 28, 2016

కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ సినిమా ఇప్పుడు చెన్నై లో జరుగుతోంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ఇక్కడ చిత్రీకరిస్తున్నారని సమాచారం. సినిమాకు సంగీత దర్శకుడిగా చేస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ నివాసం కూడా చెన్నైలోనే. దీంతో గ్యారేజ్ సెట్ కు సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాడు దేవి. మూవీ షూటింగ్ ను చూడటంతో పాటు, యూనిట్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పాడు దేవీ. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. కొరటాల శివకు దేవీ శ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు. ఇప్పటి వరకూ వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన మిర్చి, శ్రీమంతుడు సినిమాలు మ్యూజిక్ ల్ ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి. జనతా గ్యారేజ్ కు కూడా అదే రేంజ్ ట్యూన్స్ ఇస్తున్నాడట దేవీ. ఇప్పటికే ట్యూన్స్ ఫైనల్ అయిపోయాయని, త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మూవీ టీం చెబుతున్నారు. జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ ఆగష్ట్ 12.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



