Home

»

Latest News

నందమూరి హీరోలను దెబ్బతీస్తోన్న సీనియర్ హీరో..?

Sep 3, 2016 11:19AM

తమ అభిమాన హీరో నటించిన సినిమా హిట్ అయితే పర్వాలేదు కాని ప్లాపయితే ఎందుకు ప్లాపయ్యిందోనని పోస్ట్‌మార్టం మొదలెడతారు అభిమానులు. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌కాకపోవడంతో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇలా ఎందుకు జరిగింది చెప్మా అని ఫ్యాన్స్ సినిమాలో మైనస్‌ పాయింట్లను వెతికే పనిలో పడ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వారి విశ్లేషణలో మైనస్‌గా కనిపించిన వ్యక్తి ఎన్టీఆర్‌కి మామగా నటించిన సీనియర్ హీరో సురేష్‌ . నందమూరి హీరోల సినిమాల్లో సురేష్ నటించిన గత సినిమాల ట్రాక్ రికార్డును పరిశీలించగా తెలిందేంటంటే అతను, నందమూరి అందగాళ్లతో నటిస్తే ఆ సినిమా ఫట్టేనని. దీనికి ఉదాహరణగా నందమూరి బాలకృష్ణతో సురేష్ నటించిన "శ్రీమన్నారాయణ", "లయన్" అలాగే, కళ్యాణ్‌రామ్ నటించిన "ఓం త్రీడి" సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో సురేష్ సెంటిమెంట్‌ కారణంగానే గ్యారేజ్ దెబ్బైపోయింది అని జూనియర్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com