
స్టార్ హీరో సినిమా విడుదలైందంటే అంతా వసూళ్ల గురించి మాట్లాడుకొంటారు. చిత్రబృందంకూడా.. మా సినిమా తొలి రోజు ఇంత వసూలు చేసిందీ, ఆ రికార్డులు బద్దలు కొట్టిందని గొప్పలు చెప్పుకొంటుంది. జనతా గ్యారేజ్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈసినిమా తొలిరోజు దాదాపుగా రూ.24 కోట్ల వరకూ వసూలు చేసిందని చిత్రబృందం చెప్పుకొంటోంది. ఆల్ టైమ్ ఇండ్రస్ట్రీ వసూళ్లలో 3వ స్థానంలో ఉన్నామని జనతా టీమ్ అంటోంది. అయితే ఈ లెక్కలన్నీ తప్పు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు జనతా వసూళ్లు రూ.18 కోట్లేనని లెక్కలు గట్టి మరీ చూపిస్తున్నాయి. బెనిఫిట్ షోల ద్వారా ఎంతొచ్చిందో అధికారికంగా తెలియకపోయినా.. వాటినీ ఫస్ట్ డే వసూళ్లలో చూపించడం వల్ల.. నికార్సు లెక్కలేవీ బయటకు రాలేదు. ఓవర్సీస్‌లో 5.5 లక్షల డాలర్లు వసూలు చేసిందని చెబుతున్నా.. అక్కడ అంత ఉండకపోవొచ్చని ట్రేడ్ ఎనలిస్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ రూ.24 కోట్ల లెక్క సరి కాకపోతే... శ్రీమంతుడు రికార్డుల్ని జనతా గ్యారేజ్ దాటనట్టే లెక్క! సో.. జనతా 4 వ స్థానంలో ఉందన్నమాట. రేపటికల్లా తొలిరోజు వసూళ్లపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.





.jpg)
