
భారీ అంచనాల మధ్య జనతా గ్యారేజ్ సినిమా విడుదలైంది. తొలి రోజు వసూళ్లలో దుమ్ము దులిపినా జనతాలో ఎన్నో లోపాలు. ప్లస్సులు కంటే.. ఈసినిమాలో మైనస్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ ఎన్టీఆర్ అభిమానులు కూడా... ఆ తప్పుల్ని ఒప్పుకొంటున్నారు. ఇంతకీ జనతాలో బలంగా కనిపించిన ఆ బలహీనతలు ఏమిటి? జనాలు వేటి గురించి ఎక్కువగా మాట్లాడుకొంటున్నారు.. అవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొంటే...
* కథలో కొత్తదనం లేదు. సరికదా, ఏ సన్నివేశం కూడా కొత్తగా అనిపించలేదు. ప్రస్థానం, సర్కార్ ఛాయలు ఎక్కువగా కనిపించాయి.
* కొరటాల మంచి రచయిత.. కానీ అతని పెన్ను అప్పుడప్పుడు మాత్రమే మెరిసింది.
* ఈ సినిమాలో అసలు హీరోయిన్లు ఉన్నారా అనిపిస్తుంది. సమంత, నిత్యల పాత్రలు అంత ఘోరంగా ఉన్నాయి.
సమంత అస్సలు బాలేదు. ఆమె గ్లామరంతా ఏమైపోయిందో?
* జనతా గ్యారేజ్ సినిమా మొదలైన తొలి 40 నిమిషాల్లో ఎన్టీఆర్ కనిపించేది రెండంటే రెండే సార్లు. అది ఎన్టీఆర్ అభిమానుల్ని ఇబ్బంది పెట్టే విషయమే.
* ఎన్టీఆర్‌ని ప్రకృతి ప్రేమికుడిగా చూపించారు. తొలి సగం అంతా అలానే నడిపారు. కానీ ఇంట్రవెల్ తరవాత ఆ మాటే మర్చిపోయారు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్‌కీ ఈ కథకీ సంబంధం లేకుండా పోయింది.
* ఇంట్రవెల్ బ్యాంగ్ సాదా సీదాగా ఉంది. ఆ సీన్‌లో ఎమోషన్ కూడా పండలేదు.
* జనతా గ్యారేజ్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టడానికి ఓ బలమైన కారణం ఉండాలి.. అది ఈ సినిమాలో కనిపించలేదు.
* ఆనంద్ ఎవరో కాదు తమ్ముడి కొడుకే అని మోహన్ లాల్‌కి తొలిసారి తెలిసే సన్నివేశం చాలా సాదా సీదాగా తెరకెక్కించాడు దర్శకుడు. ఆసీన్‌లో ఎన్టీఆర్ హావభావాలూ అంత గా పండలేదు. పెదనాన్న... అంటూ ఎన్టీఆర్ పాత్ర ఒక్కసారి కూడా పలకరించడు.
* ఈ కథలో ప్రధాన మైన లోపం.. బలమైన విలన్ లేకపోవడమే. ఉన్నిముకుందన్ పాత్రని పాడుచేశారు.
* క్లైమాక్స్ అయితే... మరీ దారుణం. బాంబు బ్లాస్టులంటూ హడావుడి తప్ప ఏం లేదు.
ఈ లోపాలపై దర్శకుడు కాస్త దృష్టిసారిస్తే బాగుండేది. కానీ ఏం చేస్తాం? సినిమా బయటకు వచ్చేశాక స్క్రిప్టు మళ్లీ రాసుకొందామనుకొంటే లాభం ఏముంది??




.jpg)

