.jpg)
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో తెరకెక్కిన సినిమా జనతా గ్యారేజ్ గురువారం రిలీజైంది. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన గ్యారేజ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయి. తమ అభిమాన నటుడు బాక్సాఫీస్ ముందు నిలబడ్డాడా లేదా అన్నది తెలుసుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది. ట్రేడ్ వర్గాలు ముందుగా అనుకున్నట్లుగానే జనతా గ్యారేజ్ వసూళ్ల పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ వసూళ్లలో హాఫ్ మిలియన్ మార్క్‌ను టచ్ చేసింది. ఏపీ,తెలంగాణలో తొలి రోజు రూ.20.43 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఫస్ట్ డే ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.24.19 కోట్టు కొల్లగొట్టి..ఓవరాల్‌గా ఫస్ట్‌డే వసూళ్లలో నాన్ బాహుబలి తర్వాత ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.




.jpg)

