‘అవతార్3’కి ఏమైంది.. ‘అవతార్2’ని రీరిలీజ్ ఎందుకు చేస్తున్నారు?
on Sep 4, 2025
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రేక్షకుల్ని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళిన సినిమా ‘అవతార్’. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రాన్ని రిలీజ్ చేసి మరోసారి సంచలనం సృష్టించారు. ఈ సినిమా కూడా భారీ కలెక్షన్లు సాధించింది.
రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు 13 సంవత్సరాల సమయం తీసుకున్న కామెరాన్.. అవతార్3కి మాత్రం మూడు సంవత్సరాలు మాత్రమే టైమ్ తీసుకున్నారు. డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అవతార్2 మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అక్టోబర్ 3 నుంచి వారం రోజుల పాటు థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. డిసెంబర్‌లో అవతార్ 3 రిలీజ్ కాబోతుండగా హఠాత్తుగా అవతార్2ను రీరిలీజ్ చెయ్యడం వెనుక రీజన్ ఏమిటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అవతార్3 చిత్రాన్ని చూసే ప్రేక్షకులను ప్రిపేర్ చేసేందుకే పార్ట్ 2ను రిలీజ్ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రీరిలీజ్ ఇండియాలో కూడా ఉంటుందా లేక విదేశాలకే పరిమితం చేశారా అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఏమైనా అవతార్2 మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



