Home

»

Latest News

Jailer 2: జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!.. వాళ్ళు తప్పుకుంటే మంచిదేమో 

May 22, 2026

 

సౌత్ ఇండియన్ సినీ ప్రేమికులు జైలర్ పార్ట్ 2(jailer 2) కోసం ఎదురుచూస్తున్నంత ఇదిగా మరో చిత్రం కోసం ఎదురుచూడటం లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా జైలర్ పార్ట్  1 తో ముత్తువేల్ పాండియన్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్  రికార్డుల వేటని సృష్టించాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన భారీ అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 


వినాయక చవితి కానుకగా సెప్టెంబరు రెండో వారంలో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని  10 లేదా 11వ తేదీ ఫిక్స్ అయ్యారనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు త్వరలోనే మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రజినీ ఫ్యాన్స్ స్పందిస్తూ టైగర్ గా హుకుం వినాయక చవితికి వస్తున్నాడు. ఆ టైంలో ఎవరు పోటీకి రాకుండా హ్యాపీగా వినాయక చవితి వేడుకలు చేసుకోండనే కామెంట్స్ చేస్తున్నారు.  

 2023లో వచ్చిన మొదటి భాగం 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా  600 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి డల్ గా ఉన్న రజినీ కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇచ్చింది  దీంతో  దర్శకుడు నెల్సన్  పార్ట్ 1 ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో సీక్వెల్ ని తెరకెకెక్కించాడు. రజనీతో పాటు పార్ట్ 1 లో మెరిసిన మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్‌లు మళ్లీ గెస్ట్ రోల్స్ లో  కనువిందు చేయనున్నారు. ర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో నటిస్తున్నట్లు స్వయంగా ప్రకటించడంతో సినిమాపై హైప్ రెట్టింపయింది. బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్‌జె సూర్య లాంటి స్టార్స్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.  రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మరో సారి అదిరిపోయే ఆల్బమ్ ని అందించనున్నాడు 

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు చిత్ర యూనిట్ కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా, కొన్ని రోజుల క్రితం ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని కీలకమైన సన్నివేశాల వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం చిత్ర పరిశ్రమను కలవరపరిచింది. దీనిపై సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ వెంటనే స్పందించి, యాంటీ పైరసీ టీమ్ ద్వారా ఆ లీక్డ్ వీడియోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకుంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com