సినిమా ప్రియులకు వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్లతో పాటు డిజిటల్ స్క్రీన్స్ పై ఎలాంటి కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ వారం కూడా సినీ లవర్స్‌కు బోలెడంత వినోదాన్ని పంచేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సిద్ధమయ్యాయి. మే 22న ఏకంగా 16 చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వివిధ డిజిటల్ వేదికలపై అలరించేందుకు లైన్ లోకి వచ్చేశాయి.
ఈ వారం ఓటీటీలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో 'దురంధర్' అన్‌కట్ వర్షన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ మరియు జియో హాట్‌స్టార్ వేదికలుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ 'సిస్టమ్', మలయాళీ ప్రాజెక్ట్ 'మధువిదు' వంటి విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు కూడా ఈ డిజిటల్ వినోద జాతరలో భాగం కానున్నాయి.
మరోవైపు ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో 'లేడీస్ ఫస్ట్', 'దిస్ ఈజ్ నోటా టెస్ట్', 'మేటింగ్ సీజన్ 1' వంటి హాలీవుడ్ కంటెంట్‌తో పాటు పిల్లలను అలరించే యానిమేషన్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, జీ5, సోనీలివ్, మరియు లయన్స్ గేట్ ప్లే వంటి టాప్ ప్లాట్‌ఫామ్స్ లో సరికొత్త ప్రాంతీయ చిత్రాలు మరియు వెబ్ సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి.
ఇక థియేటర్ల విషయానికొస్తే.. ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద కూడా చిన్న సినిమాల హడావుడి గట్టిగానే కనిపిస్తోంది. నందు, అవికా గోర్ కాంబినేషన్‌లో వస్తున్న 'అగ్లీ స్టోరీ'తో పాటు 'రమణి కళ్యాణం', 'పురుషః' వంటి చిత్రాలు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరోవైపు స్టార్ హీరో మోహన్‌లాల్ 'దృశ్యం 3'తో గురువారమే థియేటర్లలో సందడి చేయడం విశేషం.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ వారం విడుదలవుతున్న ఓటీటీ కంటెంట్‌పై గట్టి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 'దురంధర్' అన్‌కట్ వర్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, నెట్టింట దీనిపై తెగ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లకు వెళ్లలేని వారికి, ఇంట్లోనే కూర్చుని హోమ్ థియేటర్ ఫీలింగ్ ఆస్వాదించడానికి ఈ వీకెండ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.




