పెళ్లాం అమ్మేసినా చూశారు.. కూతుర్ని చంపేసినా చూశారు!
on Aug 20, 2017

జగపతిబాబు ఎంతో ఉద్వేగంతో అన్న మాటలివి. ఇంతకీ జగ్గుభామ్ అంత ఉద్వేగంగా మాట్లాడటానికి కారణం? తను వదలను? అంటోంది ఎవరిని? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.
జగపతిబాబు రీసెంట్ ఫిలిం ‘జయ జానకి నాయక’. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకునిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జగ్గూ భాయ్ ఓ విలన్ గా నటించాడు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ఇటీవలే కృష్ణాజిల్లా హంసల దీవిలో జరిగింది. అదే ప్రాంతంలో ఈ సినిమాకు సంబందించిన ఓ పోరాట సన్నివేశాలను కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమాకు అదే హైలైట్ గా నిలిచింది. అందుకే... అదే ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా జగపతిబాబు ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడానికి నిలబడ్డాడు. దాంతో... ‘జగపతిబాబూ జిందాబాద్’ అంటూ జయజయ ధ్వానాలు మిన్నంటాయ్. దాంతో... ఆయన ఉద్వేగానికి లోనయ్యాడు. ‘పెళ్లాం అమ్మేసినా నన్ను చూశారు. కూతుర్ని చంపేసినా నన్ను చూస్తున్నారు. ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను. ‘లెజెండ్’కి ముందు అందరూ నా పని అయిపోయిందన్నారు. నేను స్వతహాగా మొండోడ్ని. అలాగే ఆ సినిమాలో నన్ను చూపించాడు బోయపాటి శ్రీను. మీ జగపతిబాబు లోని మరో కోణం ఆ సినిమా నుంచి మొదలైంది. నేను మళ్లీ చెబుతున్నాను. నేను ఎక్కడికీ వెళ్లను. మిమ్మల్ని కూడా వదలను నేను మొండోడ్ని’అని ఉద్వేగంగా మాట్లాడాడు జగపతిబాబు. అభిమానులు ఆ రేంజ్ లో జేజేలు కొడుతుంటే... ఆ మాత్రం ఉద్వేగానికి లోనవ్వడం కామనే. ఎమంటారు ఫ్రెండ్స్?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



