చావు దాకా వెళ్లి బయటపడ్డ జగపతి
on May 4, 2016

యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన వరం. తిండి లేకపోయినా..నీళ్లు లేకపోయినా మనిషి బతకవచ్చు. కాని గాలి లేకపోతే మాత్రం మనిషి బతకలేడు. అయితే యోగాపై పట్టున్న వారికి గాలి లేకపోయినా డోంట్ వర్రి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సియాచిన్ దుర్ఘటనలో వేల టన్నుల మంచు మీద పడినా..35 అడుగుల లోతులో ఇరుక్కుపోయినా..నాలుగు రోజుల పాటు కొన ఊపిరితో బ్రతికారు లాన్స్ నాయక్ హనుమంతప్ప. అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డారు నటుడు . ఓ సారి ఆయన ఓ సినిమాలో యాక్షన్ సీన్ చేశాడు. అందులో ఓ సీన్ కోసం ఆయనను భూమి లోపల పాతిపెట్టారు. ఆ సినిమా యూనిట్ వాళ్లంతా జగపతి బాబు గురించి చాలా టెన్షన్ పడ్డారట. అయితే చివరి నిమిషంలో చాలా స్పీడ్‌గా భూమి లోపల నుంచి జగపతి బాబుని బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. బయటకు వచ్చేంతవరకు లోపల గాలి లేదు. అయినప్పటికీ అంత సేపు ఎలా ఉండగలిగారని చిత్ర యూనిట్ అడిగితే..ఆ టైంలో యోగా చేస్తూ..శ్వాస మీద దృష్టి పెట్టడం వల్లనే తను బతికి బయటపడినట్లు జగపతిబాబు ఇటీవల స్వయంగా వెల్లడించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



