Home

»

Latest News

జగపతి బాబు డబ్బింగ్‌పై సుకుమార్ కండిషన్.. ఆ ఆబ్జర్వేషన్‌కు జగ్గూభాయ్ మైండ్ బ్లాక్!

May 29, 2026 6:06PM


వెండితెరపై విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు సీనియర్ నటుడు జగపతి బాబు. హీరోగా ఎంతగా అలరించారో, సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అంతకంటే అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లెక్కల మాస్టర్, టాప్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో జగ్గూభాయ్ చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తాజాగా ఆయన సుకుమార్ మేకింగ్ స్టైల్, ఆయనకున్న అద్భుతమైన పరిశీలన శక్తి గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో స్టైలిష్ విలన్‌ కృష్ణమూర్తిగా, ‘రంగస్థలం’లో పవర్‌ఫుల్ ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు నటన థియేటర్లలో రచ్చ లేపింది. అలాగే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘పుష్ప’ సిరీస్‌లోనూ ఆయన ఒక కీలకమైన సెంట్రల్ మినిస్టర్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించారు. అయితే ఈ సినిమా డబ్బింగ్ సమయంలో సుకుమార్ తనను ఏ విధంగా ఆశ్చర్యపరిచారో జగపతి బాబు తాజాగా రివీల్ చేశారు.

ఆ వివరాల్లోకి వెళితే.. ‘పుష్ప2’ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన తర్వాత జగపతిబాబు ఆ వాయిస్ శాంపిల్‌ను సుకుమార్‌కు పంపించారట. అయితే ఆ వాయిస్ మెసేజ్ విన్న సుకుమార్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. "సార్, మీరు కూర్చొని డబ్బింగ్ చెప్పారు కదా.. వద్దు, నిలబడి లేదా నడుస్తూ డబ్బింగ్ చెప్పండి" అని రిప్లై ఇచ్చారట. తాను కూర్చొని డబ్బింగ్ చెప్పిన విషయాన్ని కేవలం వాయిస్ బేస్ ఆధారంగానే సుకుమార్ అంత పక్కాగా కనిపెట్టేయడంతో జగ్గూభాయ్ ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఒక దర్శకుడికి ప్రతి చిన్న విషయంపై ఎంతటి అబ్జ‌ర్వేష‌న్‌ ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన కొనియాడారు.

డబ్బింగ్ రూమ్‌లో నడవడానికి తగినంత స్థలం లేకపోవడంతో, మైక్ చేతపట్టుకుని బయటకు వచ్చి నడుస్తూ ఆ డైలాగ్స్ రికార్డ్ చేశానని జగపతిబాబు చెప్పుకొచ్చారు. ఈ రేంజ్ పర్‌ఫెక్షన్ ఉంటుంది కాబట్టే సుకుమార్ సినిమాలు అంత అద్భుతంగా వస్తాయని ఇండస్ట్రీ వర్గాల సైతం చర్చించుకుంటున్నాయి. కేవలం సుకుమారే కాదు, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా డబ్బింగ్ విషయంలో గురువుకు తగ్గ శిష్యుడే అని నిరూపించుకున్నాడట. మెగా పవర్ స్టార్ రామ్‌చ‌రణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’లో జగపతి బాబు ‘అప్పల సూరి’ అనే పవర్‌ఫుల్ విలేజ్ క్యారెక్టర్ చేస్తున్నారు.

ఈ ‘పెద్ది’ సినిమా గురించి మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌లోనే ఇంతవరకు ఎప్పుడూ పడనంత కష్టం ఈ అప్పల సూరి పాత్ర కోసం పడ్డానని జగ్గూభాయ్ తెలిపారు. ఈ క్యారెక్టర్‌కు వాడిన భాష, యాస, ఎమోషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని.. పర్‌ఫెక్షన్ కోసం డబ్బింగ్ థియేటర్‌లో ఒక్కోసారి రోజంతా కష్టపడి కేవలం రెండే రెండు డైలాగులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఏదేమైనా జగ్గూభాయ్ ఖాతాలో మరో మైలురాయి లాంటి పాత్ర పడబోతుందని అర్థమవుతోంది. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ స్పోర్ట్స్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com