మేకప్‌మేన్‌గా మారిన సీనియర్ స్టార్!.. 'గుడ్ జాబ్' అన్న హీరోయిన్!
on Apr 19, 2021
కొవిడ్ 19 సెకండ్ వేవ్ దెబ్బకు దేశమంతా అతలాకుతలమవుతోంది. ఫస్ట్ వేవ్‌లో చూడని రీతిలో కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. వాక్సినేషన్‌తో కొవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌కు గురవుతున్న రంగాల్లో సినీ రంగం ముందు వరుసలో ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కొంతమంది పాజిటివ్‌గా నిర్ధారణ అవుతూనే ఉన్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడ్డారు. సెట్స్ మీద ఉన్న సినిమాలకు సంబంధించి కొంతమంది పర్సనల్ మేకప్మేన్ల సాయం తీసుకోకుండా తామే మేకప్ వేసుకుంటూ షూటింగ్లో పాల్గొంటుండటం కనిపిస్తోంది. ఆ జాబితాలో లేటెస్ట్గా సీనియర్ స్టార్ యాక్టర్ జగపతిబాబు చేరిపోయారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి, యమ బిజీగా ఉన్నారాయన.
ఓ సినిమా షూటింగ్ లొకేషన్లో తనకు తానే మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆయన షేర్ చేశారు. ఆ పిక్చర్లో తన మేకప్ రూమ్‌లో ఒక హెల్పర్ మిర్రర్ పట్టుకొని ఉండగా, అందులో చూసుకుంటూ మేకప్ సరిచేసుకుంటున్నారు జగపతిబాబు. దానికి, "Thanks to covid.. I have become my own make up man. Ha haa." అనే క్యాప్షన్ జోడించారు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆయన చేసిన ఈ పోస్ట్‌కు కామెంట్ సెక్షన్లో నటి విమలా రామన్ స్పందించింది. "Hahaha good job." అని కామెంట్ పెట్టింది.
జగపతిబాబు, విమలా రామన్ జంటగా రెండు సినిమాలు చేశారు. అవి.. 'గాయం 2', 'చట్టం'. సో.. తన హీరోను విమలా రామన్ బాగానే ఫాలో అవుతోందనేందుకు ఆమె పెట్టిన కామెంట్ నిదర్శనం.