
పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ సినిమా అర్థాంతరంగా ఆగిపోయినట్టు టాలీవుడ్ టాక్. కాటమరాయుడు తరవాత పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సివుంది. ఆ సినిమాకి దేవుడే దిగివస్తే అనే టైటిల్ కూడా అనుకొన్నారు. త్రివిక్రమ్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు కూడా. అయితే సడన్ గా ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేశారని టాక్. నేసన్ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్ మరో హీరోని చూసుకోవాల్సివస్తోంది. త్రివిక్రమ్ సై అంటే హీరోలకు కొదవ లేదు. స్టార్ హీరోలెవరైనా సరే.. ఈ మాటల మాంత్రికుడితో పని చేయడానికి రెడీనే. అందరి కంటే.. ఎన్టీఆర్కే త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు మొండుగా ఉన్నాయి. జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఎవరితో అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పూరి, లింగు స్వామి లైనులో ఉన్నారు. ఇప్పుడు సడన్ గా త్రివిక్రమ్ పేరు కూడా కలిసింది. త్రివిక్రమ్ రెడీ అంటే.. ఎన్టీఆర్ మిగిలిన ఆప్షన్లు పక్కన పెట్టడానికి సిద్దమే. సో.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌ల సినిమానే పట్టాలెక్కడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ విషయం మరో పది రోజుల్లో తేలిపోనుంది. సో.. అప్పటి వరకూ ఎదురుచూడాల్సిందే.






