చైతూ-సమంత వ్యవహారం తెలిసే సమంత పేరు తలవని ఆమిర్ ఖాన్!
on Sep 20, 2021
ఆదివారం రాత్రి జరిగిన 'లవ్ స్టోరి' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ ఈవెంట్ ఉందని తెలిసి, తనంతట తాను దానికి వస్తానని నాగచైతన్యకు చెప్పి మరీ వచ్చారాయన. తన స్పీచ్‌లో చైతూ గుణగణాలను తెగ పొగిడిన ఆమిర్, చైతూ తల్లిదండ్రులు నాగార్జున, లక్ష్మిలను తలచుకుని, చైతూ భార్య సమంత పేరు ప్రస్తావించకపోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే చైతూ-సామ్ గొడవ గురించి ఆమిర్‌కు సమాచారం ఉందనీ, అందుకే ఆయన సమంత పేరును తలవలేదనీ ఇండస్ట్రీ జనాలతో పాటు, అక్కినేని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.
ఆమిర్ లేటెస్ట్ ఫిల్మ్ 'లాల్ సింగ్ చడ్ఢా'లో చైతూ ఓ కీలక పాత్ర చేశాడు. ఈ విషయం ప్రస్తావిస్తూ, "చైతూతో కలిసిన పనిచేయడం నాకు చాలా బాగనిపించింది. అతను చక్కని యాక్టర్, ఒక ప్రత్యేకమైన మనిషి." అని ప్రశంసించారు. చైతూ తల్లిదండ్రులు నాగార్జున, లక్ష్మి ఫోన్ నంబర్లు తీసుకున్నానని అన్నారు. ఆ తల్లిదండ్రుల కారణంగానే మనముందుకు ఇలాంటి మంచి మనిషి వచ్చాడని, అతని పేరెంట్స్‌కు మొదట థాంక్స్ చెప్పాలి అని పొగిడారు. చైతూకు ఫ్యామిలీ ఉన్నా, అతనికి అతిపెద్ద ఫ్యామిలీ ఫ్యాన్స్ అన్నారు. ఈ సందర్భంలో సమంత పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చైతూ, సామ్ మధ్య అనుబంధం పలుచనయ్యిందనే అభిప్రాయం కలుగుతోంది. రెండు నెలల పైనుంచే ఆ ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. పైగా ఒకే ఇంట్లో కూడా ఉండటం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సమంత ఇటీవల తన ఫ్రెండ్‌తో గోవా ట్రిప్ వేసి జాలీగా గడిపి వచ్చింది. ఒంటరిగా తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను సందర్శించింది. ఇది వారు విడిపోతున్నారనేందుకు గట్టి సంకేతమని సినీ జనాలు అనుకుంటున్నారు.
సమంత, చైతూ మధ్య గొడవలకు కారణమేంటనే విషయంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయే కానీ, ఇదమిత్థంమైన కారణం ఏమిటనేది తెలియలేదు. అయితే ఆ ఇద్దరూ విడిపోవడం తథ్యమనేట్లు వారి వ్యవహార ధోరణి కనిపిస్తోంది. ఈ విషయం ఆమిర్‌కు తెలిసినందువల్లే సమంత పేరును కావాలనే ఆయన ప్రస్తావించలేదనీ, పైగా చైతూను తెగ పొగిడారనీ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read