Home

»

Latest News

9 రోజుల్లో `హ్యాట్రిక్` ఫ్లాప్స్ కొట్టిన సేతుప‌తి!

Sep 19, 2021

 

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి.. ద‌క్షిణాది ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచిన అభినేత్రుడు. మ‌రీముఖ్యంగా.. గ‌డిచిన ద‌శాబ్ద‌కాలంలో సేతుప‌తి కెరీర్ పురోగ‌మించిన తీరుతో పాటు అత‌ని సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌కి ఎవ‌రైనా స‌రే ఫిదా అవ్వాల్సిందే. కేవ‌లం క‌థానాయ‌కుడి వేషాల‌కే ప‌రిమితం కాకుండా న‌ట‌న‌కి అవ‌కాశ‌మున్న ఎలాంటి పాత్ర‌కైనా ఓటేసే వైనం.. విజ‌య్ సేతుప‌తికి ఎన‌లేని అభిమాన గ‌ణాన్ని సంపాదించి పెట్టింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో `మాస్ట‌ర్`, `ఉప్పెన‌` వంటి చిత్రాల్లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ క‌న‌బ‌రిచిన‌ విల‌నిజం.. ఆయా చిత్రాల ఘ‌న‌విజ‌యంలో ముఖ్య భూమిక పోషించ‌ద‌న్న‌ది నిజం.

అలాంటి.. ఈ యాక్టింగ్ ప‌వ‌ర్ హౌస్ ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు వ‌రుస‌ సినిమాల‌తో త‌న‌ని అభిమానించే వారిని డిజప్పాయింట్ చేశాడు. అది కూడా.. కేవ‌లం తొమ్మిది రోజుల్లో. విశేష‌మేమిటంటే.. ఈ చిత్ర‌త్ర‌యాలు వేర్వేరు వేదిక‌ల్లో జ‌నం ముందుకు వ‌చ్చాయి. సెప్టెంబ‌ర్ 9న విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన `లాభం` థియేట‌ర్స్ లో రిలీజై ఘోర‌ప‌రాజ‌యం పాల‌య్యింది. 

ఇక సెప్టెంబ‌ర్ 10 సాయంత్రం స‌న్ టీవీలో డైరెక్ట్ టు టెలివిజ‌న్ కేట‌గిరిలో ప్ర‌సార‌మైన `తుగ్ల‌క్ ద‌ర్బార్`.. ఆపై 11న ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అలాగే ఈ శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 17) మ‌రో ప్ర‌ముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన `అనాబెల్ సేతుప‌తి` గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది అన్న‌ట్లుగా ప‌రిస్థితి త‌యారైంది. మొత్త‌మ్మీద‌.. కేవ‌లం 9 రోజుల్లో ఫ్లాపుల `హ్యాట్రిక్`తో టాక్ ఆఫ్ కోలీవుడ్ అయ్యాడు విజ‌య్ సేతుప‌తి. మ‌రి.. రాబోయే సినిమాల‌తోనైనా ఈ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ అభిమానుల‌ను అల‌రిస్తాడేమో చూడాలి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com