
మాటకి మహాత్యమే కాదు బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడిస్తు కలెక్షన్ల వర్షాన్ని కురిపించే శక్తీ కూడా ఉందని నిరూపించిన త్రివిక్రమ్, దర్శకుడుగా కూడా అదే పంధాని అనుకరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబాన్ని సెట్స్ పై ఉంచి ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ పనిలో కూడా ఉన్నాడు.
రీసెంట్ గా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ గతంలో 'అజ్ఞాతవాసి' మూవీ గురించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ మాట్లాడుతు 'అజ్ఞాతవాసి వల్ల వచ్చిన నష్టాలని క్లియర్ చేయడానికి నిర్మాత రాధాకృష్ణతో కలిసి రెండు రోజుల్లోనే ఆర్థిక సమస్యలని క్లోజ్ చేసాం. నా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేయడంతో పాటు ఆ సమయంలో జూబ్లీ హిల్స్ లో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాను. దీంతో నష్టాల నుంచి గట్టెక్కడానికి నిర్మాణంలో ఉన్న ఇల్లుని అమ్మేయాలనుకున్నాను. ఈ విషయం నా భార్య పిల్లలకి చెప్తే నా ఇష్టం అన్నారని త్రివిక్రమ్ చెప్పాడు. ఇప్పుడు ఈ న్యూస్ అనే కాదు చాలా పాత సినిమా న్యూస్ వైరల్ గా మారుతున్నాయి. ఇందుకు కారణం టాక్సిక్ పరాజయం ఒడిలో షికారు చేస్తుంది కాబట్టి.
Also read: టాక్సిక్: మూవీ చూసిన జపాన్ లేడీ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.. ఫ్యాన్స్ హడావిడి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో' జల్సా, అత్తారింటికి దారేది తర్వాత 'అజ్ఞాతవాసి' వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించగా నాగ వంశీ సహా నిర్మాత. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వచ్చిన 'జులాయి' తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ అవ్వగా, త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వచ్చిన జులాయి నుంచి ప్రస్తుత ఆదర్శ కుటుంబం, నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ వరకు అన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నే నిర్మించింది. ఆ బ్యానర్ కూడా త్రివిక్రమ్ తో తప్ప ఇంకెవరి తో సినిమాలు చెయ్యలేదు.
[Trivikram Srinivas, Agnyaathavaasi, Pawan Kalyan, Radhakrishna, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]







