.webp)
-సినిమా పేరు: ది ప్యారడైజ్
-నటీనటులు: నాని, కయదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి,కీర్తి సురేష్ తదితరులు
-సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
-ఫొటోగ్రఫీ: సీ హెచ్ సాయి
-ఎడిటర్: నవీన్ నూలి
-నిర్మాత: సుధాకర్ చెరుకూరి
-బ్యానర్ పేరు: ఎస్ ఎల్ వి సినిమాస్
-రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
-రిలీజ్ డేట్: సెప్టెంబర్ 24 ,2026
నాచురల్ స్టార్ నాని తన ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' తో ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలతో అభిమానులు, ప్రేక్షకుల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ గా కూడా మారింది. మరి ప్యారడైజ్ ఎలా ఉందో చూద్దాం.
కథ
దుబ్బమ్మ.. పరమ శివుడినే మింగిన దేవత.. హైదరాబాద్ జాగీర్ లో ప్యారడైజ్ అనే ఏరియా శికంజి మాలిక్(మోహన్ బాబు) అనే సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. 200 ఏళ్లుగా పరిపాలిస్తున్న మాలిక్ వంశీయులు అణువణువున అహంకారం నిండిన వాళ్ళు. సమ్మక్క( సోనాలి కులకర్ణి) ప్యారడైజ్ ప్రాంగణంలో నివసించే సవారీ అనే అణగారిన జాతికి చెందిన వ్యక్తి. తన జాతి గుర్తింపు కోసం శికంజి మాలిక్ తో పోరాడుతు ఉంటుంది. సవారీ జాతి వాళ్ళ శరీరం ఎప్పుడు కంపు కొడుతూనే ఉంటుంది. సమ్మక్క కొడుకు జడల్..(నాని) చిన్న తనం నుంచే తల్లి సమ్మక్క మీద ద్వేషం పెంచుకొని ఉంటాడు. తన తల్లి కల కంటున్న తన జాతి గుర్తింపుకి విరుద్ధంగా ఉంటాడు. భారత ప్రభుత్వం సవారీ జాతిని దేశ ద్రోహులుగా గుర్తిస్తుంది. నిజంగానే సవారీ జాతిని ఇండియన్ గవర్నమెంట్ దేశద్రోహులుగా గుర్తించిందా? ఆ పరిస్థితుల్లో జడల్ తీసుకున్న నిర్ణయం ఏంటి? తన తల్లిపై ద్వేషం ఎందుకు? తన జాతి కోసం పోరాటం చేస్తే ఏ విధంగా చేసాడు? మంచి కోసం చెడు కోసమా అనేదే? ది ప్యారడైజ్.
ఎనాలసిస్
సినిమా స్టార్ట్ అయినా కొద్దిసేపటికే ఇదేదో తేడాగా ఉందని అనిపిస్తుంటుంది. అందుకు తగ్గట్టే సీన్స్ వచ్చాయి. మూవీ మొత్తాన్ని సీన్స్ ఎస్టాబ్లిష్ కోసం తీసారని అనిపిస్తుంటుంది. సినిమా మొత్తంపై జడల్ పెర్ఫార్మ్ తో పాటు సమ్మక్క పెర్ఫార్మ్ మాత్రమే బాగుంది. ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే సమ్మక్క నినాదం కథపై క్యూరియాసిటీ కలిగించినా ఆ తర్వాత ఆ ఛాయలు కనిపించవు. జడల్ ఇంట్రడక్షన్ సీన్ యాక్షన్ సన్నివేశంతో బాగున్నా, ఆ తర్వాత వచ్చిన సీన్స్ అన్ని యాదృచ్చికంగా ఉన్నాయి.
సుబ్బు(కయదు లోహర్) సీన్స్ అయితే మరి దారుణం. చనిపోయిన తన తండ్రి పరువు కోసం అప్పు తీర్చడం కోసం కోసం బూతు సినిమాలు చేయడం ఏంటో అర్ధం కాదు. అలాంటప్పుడు తన తండ్రి ఆశయం దెబ్బ తిన్నట్టేగా. సుబ్బు బూతు సినిమాలు చేయడం ఎంటర్ టైన్ మెంట్ కోణంలో అయినా చూపించాల్సింది. విక్రం మాలిక్( రాఘవ్ జుయల్) సీన్స్ అయితే అసలు బాగోలేదు. జడల్ తన తల్లి సమ్మక్క ని ద్వేషించే సీన్స్ సో సో. సమ్మక్క శరీరాన్ని అమ్ముకోవడం అనేది మరో కోణంలో ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఎందుకంటే ఆమె పోరాట నాయకురాలు కదా. అంత ఈజీగా లొంగదు కదా! ఇంటర్వెల్ ఎపిసోడ్ నార్మల్. సెకండ్ హాఫ్ చూసుకునే జడల్ తీసుకున్న నిర్ణయంతో కథనంలో కొంచం స్పీడ్ వచ్చినట్లనిపించింది.
కానీ సీన్స్ రొటీన్ కావడంతో ప్యారడైజ్ తో జర్నీ కాలేకపోతాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పోలిన శంకర్( ప్రియదర్శి) క్యారక్టర్ ఒక్కటే కొంచం క్యూరియాసిటీ కలిగించింది. భారత ప్రభుత్వం టిడా( టాడా) చట్టం ప్రయోగించి టెర్రరిస్టులుగా అనేది ఆశ్చర్యం గా ఉంటుంది. గుర్తింపు కోసం పోరాటం చేసే వాళ్ళు ప్రభుత్వం దగ్గరకే వెళ్ళవచ్చు కదా! ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సో.. సో
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
జడల్ గా నాని పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటనకి సంబంధించి ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయో అన్ని రకాల వేరియేషన్స్ లో ఇరగదీసాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఒక రేంజ్ పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. కొన్ని సీన్స్ లో అయితే ఒళ్ళు జలదరిస్తుంది కూడా. ఇక నట ప్రపూర్ణ మోహన్ బాబు మరోసారి శికంజి మాలిక్ రోల్ లో పారడైజ్ కి అదనపు ఆకర్షణగా నిలిచారు. కయదు లోహర్ పెర్ఫార్మ్ లో మెరుపులు ఏం లేవు. సోనాలి కులకర్ణి పెర్ ఫార్మెన్స్ బాగుంది. సంపూర్ణేష్ బాబు ఈ సారి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవ్వడం ఖాయం. అంతలా మెస్మరైజ్ చేసి పడేసాడు. సోనాలి కులకర్ణి తో పాటు మిగతా నటీనటులందరూ ప్రాణం పెట్టి నటించారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ యావరేజ్. రైటర్ గా మెప్పించలేకపోయాడు. అనిరుద్ నుంచి వచ్చిన మ్యూజిక్ లో యేష నాగులతో పాటు మిగతా సాంగ్స్ బాగా వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అంతగా పేలలేదు సుధాకర్ చెరుకూరి నుంచి వచ్చిన నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా గ్రాండ్ గా ఉన్నాయి.
బలాలు
1 . నాని పెర్ఫార్మెన్స్
బలహీనతలు
1 . కథనం
2 . డైరెక్షన్
చివరిగా చెప్పాలంటే మాస్ సినిమాలు ఇష్టపడేవాళ్ళకి, నాని ఫ్యాన్స్ కి ఒక మాదిరిగా నచ్చవచ్చు.
రేటింగ్ 2. 5 / 5
అరుణాచలం




