ఇలియానాకు యాభై లక్షలు ఇస్తే చాలంట..!
on Apr 2, 2016

కొద్దిగా రివైండ్ వేసుకుని ఒక ఐదేళ్లు వెనక్కి వెళ్తే, సౌత్ లో టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా ఇలియానాకు పేరుండేది. ఈ నడుము భామకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోవడంతో, వరస సినిమాలతో, కోటి రూపాయలు తీసుకున్న అగ్రతారగా వెలుగొందింది. కానీ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా..! పరిస్ధితులు, ఆలోచనలు మారుతూనే ఉంటాయి. ఇల్లీ భామకు కూడా అలాంటి ఆలోచనే ఒకటి వచ్చింది. ఇక్కడే మనల్ని ఇలా చూసుకుంటున్నారంటే, బాలీవుడ్ లో ఇంకెలా చూసుకుంటారో అన్న థాట్ తో, అర్జెంట్ గా బాలీవుడ్ లో మకాం వేసేసి టాప్ అయిపోదాం అని ప్లాన్ వేసింది. కానీ పాపం ఇల్లీ బేబీని బాలీవుడ్ చాలా సింపుల్ గా రిజక్ట్ చేసేసింది.
స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సరసన బర్ఫీ చేసినా మేడంగారికి కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా అరా కొరా సినిమాలు చేసింది. అన్నీ ఢాం అన్నాయి. దాంతో అక్షయ్ కుమార్ రుస్తోం సినిమా మీదే పూర్తి ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా కూడా ఇల్లికి పెద్దగా ప్లస్ అయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే, ఆ సినిమా అంతా పూర్తిగా అక్షయ్ భుజాల మీదే నడుస్తుంది. అందుకే ఇప్పుడు ఇలియానా మళ్లీ సౌత్ కు రావాలని ప్లాన్ వేస్తోందట. కేవలం 50 లక్షలకే మూవీ చేస్తానంటూ ఇక్కడి నిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోందని టాలీవుడ్ టాక్. అప్పటి తన తోటి హీరోయిన్లందరూ ఇప్పుడు కోట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఇల్లీ మాత్రం కేవలం 50 లక్షలకే సినిమా చేస్తే మళ్లీ ఒకటో రెండో సౌత్ అవకాశాలు తలుపుతట్టే అవకాశం లేకపోలేదు. కానీ హిందీకెళ్లిన తర్వాత టాలీవుడ్ ను విమర్శించిన ఇలియానాను ఇక్కడ ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



