ఇలియానా ఎమోషనల్ పోస్ట్? అతని గురించే
on Jun 11, 2023

సన్నని నడుముతో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ఆమె తన ప్రెగ్నెన్సీని కంఫర్మ్ చేసింది. ఇక అప్పటినుంచి ఆమె తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. చాలా ప్రశాంతంగా ఉంటూ నచ్చినవి తింటూ రకరకాల ప్లేసెస్ కి వెళ్తూ మంచి హుషారుగా కూడా ఉంది. ఆమె తన ప్రెగ్నెన్సీని కంఫర్మ్ చేసినప్పుడు అసలు ఇలియానాకు పెళ్లెప్పుడయ్యింది ? బిడ్డకు తండ్రి ఎవరు? అనే ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాంటి ఇలియానా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పిక్ పోస్ట్ చేశారు. ఆ పిక్ తో పాటు మనసులోని నాలుగు మాటల్ని కూడా పంచుకున్నారు.

"తల్లి కావడం ఒక అపురూపమైన అనుభూతి...ఈ ఆనందాన్ని ఇలా పొందుతానని ఎప్పుడూ ఊహించలేదు. నువ్వు నాలో పెరుగుతున్నావనే అనుభూతి చాలా సంతోషాన్ని ఇస్తోంది. దాన్ని వర్ణించడం నా వల్ల కావడం లేదు. రోజూ బేబీ బంప్ ని చూసుకుంటున్నాను...త్వరలోనే నిన్ను కలుస్తాను. రాబోయే రోజుల్లో కొన్ని కష్టాలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఆ చిన్న చిన్న విషయాలకు నేను ఏడవకూడదు అని అనుకుంటున్నాను. ఇక నుంచి నేను చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ కష్టాలనుంచి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నా కడుపులో పెరుగుతున్న నిన్ను ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేను. నా గురించి నేను కూడా పట్టించుకోవడం మర్చిపోయిన టైంలో నిరాశను, బాధను పోగొట్టుకోవడానికి నువ్వొచ్చావ్. "అంటూ తనకు ఇష్టమైన ప్రియుడి గురించి చెప్పుకొచ్చారు ఇలియానా. "నేను బాధపడినప్పుడల్లా అతను నా కన్నీళ్లు తుడిచి నవ్వించాడు. ఎన్నో జోక్స్ వేసేవాడు. ఎప్పుడేం కావాలన్నా నా దగ్గరే ఉండి అన్ని తెచ్చిపెట్టాడు. నేను భరించలేనంత బాధలో ఉన్నప్పుడు వచ్చి హగ్ చేసుకునేవాడు...ఎందుకంటే అతనికి తెలుసు ఏ టైములో నాకు ఏది కావాలో" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకున్నారు ఇలియానా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



