అమ్మాయిలు అలాగే ఉంటారు! - యష్
on May 2, 2020
చిన్న పిల్లలకు తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు గోరుముద్దలు తినిపిస్తారు. బట్, ఫర్ ఎ ఛేంజ్... కన్నడ స్టార్ యష్కి వాళ్ల అమ్మాయే గోరుముద్దలు తినిపిస్తోంది. 'కెజిఎఫ్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి పెద్దది... చిన్నారికి ఇంకా రెండేళ్లు కూడా నిండలేదు. డిసెంబర్ 2, 2018లో పుట్టింది. అబ్బాయికి ఆరు నెలలు నిండిన సందర్భంగా రీసెంట్గా యష్ తమ ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పిల్లల గురించి యష్ మాట్లాడుతూ "జీవితంలో ఇదొక అందమైన దశ. పిల్లలు సంతోషాన్ని మాత్రమే కాదు, నాలో మరో విభిన్న కోణాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను. మా అమ్మాయి ఆర్యకు నాకు గోరుముద్దలు తినిపించడం అలవాటుగా మారింది. నాకు అమ్మలా మారింది. అమ్మాయిలు అలాగే ఉంటారు" అని సంతోషం నిండిన కళ్లతో చెప్పారు. అబ్బాయి గురించి మాట్లాడుతూ "నేను, రాధిక తనతో నిద్రపోవాలి. లేదంటే వాడు నిద్రపోడు" అన్నారు. అర్ధరాత్రి నిద్రలేచి గోలగోల చేస్తాడని చెప్పారు.