బాలయ్య మాస్ క్రేజ్.. అఖండ-2 కోసం భారీ పోటీ!
on Apr 21, 2025
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Balakrishna) టాప్ ఫామ్ లో ఉన్నారు. కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' ఇలా వరుసగా నాలుగు సక్సెస్ లను చూశారు బాలకృష్ణ. ఆయనతో భారీ సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య సినిమా అంటే.. షూటింగ్ దశలో ఉండగానే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ అనే తేడా లేకుండా రైట్స్ కోసం పోటీ ఏర్పడుతోంది. ఇక బాలకృష్ణ తదుపరి చిత్రం 'అఖండ-2' (Akhanda 2) విషయంలో ఈ పోటీ మరో స్థాయికి వెళ్ళిపోయింది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. ఇప్పటిదాకా వీరి కలయికలో 'సింహ', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు రాగా.. మూడూ ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. ముఖ్యంగా 'అఖండ' సంచలనం సృష్టించింది. ఇప్పుడు బాలయ్య-బోయపాటి కాంబోలో నాలుగో సినిమాగా 'అఖండ-2' రూపొందుతోంది. అసలే బాలకృష్ణ టాప్ ఫామ్ లో ఉన్నారు. దానికి తోడు బాలయ్య-బోయపాటి కాంబోలో 'అఖండ' సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. దీంతో 'అఖండ-2'పై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి. షూటింగ్ దశలో ఉండగానే ఓ రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.
థియేటర్లలోనే మాత్రమే కాకుండా, ఓటీటీలోనూ బాలకృష్ణ సినిమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఆయన గత చిత్రం 'డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా పలు దేశాల్లో ట్రెండ్ అయింది. అందుకే 'అఖండ-2' డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఆసక్తి చూపిస్తోంది. అయితే మరో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా నెట్ ఫ్లిక్స్ కి పోటీ వస్తోందట. రెండూ సంస్థలు పోటాపోటీగా కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'అఖండ-2' డిజిటల్ రైట్స్ కోసం రెండు ప్రముఖ సంస్థలు పోటీ పడటం చూస్తుంటే.. రికార్డు ధరకు రైట్స్ అమ్ముడవడం ఖాయమనిపిస్తోంది. ఓవరాల్ గా 'అఖండ-2' బిజినెస్ డీల్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యేలా ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
