ENGLISH | TELUGU  

‘కాంతార’ కేసును రద్దు చేసిన హైకోర్టు.. వివాదానికి ఇదే కారణం!

on Nov 2, 2023

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘కాంతార’. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అవ్వలేదు. మొదట కన్నడలో విడుదలైన ఘనవిజయం సాధించిన తర్వాత మిగతా భాషల్లో విడుదల చేశారు. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాలో వరహా రూపం పాటపై వివాదం రేగింది.  ఈ  పాటపై కాపీరైట్‌ ఇష్యు వచ్చింది.  వరాహ రూపం పాట ఒరిజినల్‌ ట్యూన్‌ మాది అని, తైక్కుడం బ్రిడ్జ్‌లోని నవసరం పాటకు కాపీ అని పాట హక్కులను కలిగి ఉన్న మాతృభూమి పబ్లిషర్స్‌ దావా వేశారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు దీనిపై విచారణ జరిపింది. చివరగా తన తీర్పును వెల్లడిస్తూ.. వరాహరూపం పాటను ఓటీటీ కాకుండా థియేటర్లలో లేదా డిజిటల్‌ మీడియాలో ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు కేరళ హై కోర్టుకు వెళ్ళింది. దాంతో కాంతార టీమ్‌కి ఉపశమనం లభించింది. 

వరాహ రూపం పాట గత కొంతకాలంగా కోర్టు చుట్టూ తిరుగుతూ వుండగా.. కాంతార టీమ్‌, మాతృభూమి పబ్లిషర్స్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. కాంతార చిత్ర బృందం, మాతృభూమి పబ్లిషర్స్‌ మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. వీరిరువురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ చర్చల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి క్రిమినల్‌ ప్రొసీడిరగ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరి పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. సెక్షన్‌ 482 కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కేసును రద్దు చేసింది. ఇది రెండు సంస్థల మధ్య ఉన్న ప్రైవేట్‌ వివాదంగా కనిపిస్తోందని, ఇలాంటి కేసులు గతంలో కూడా వచ్చాయని గుర్తు చేస్తూ ఈ కేసును రద్దు చేసింది కేరళ హైకోర్టు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.