Home

»

Latest News

సీనియర్ నటి సుజాత ఇకలేరు

Apr 6, 2011 5:31PM

తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన చక్కని నటి సుజాత ఏప్రెల్ 6 వ తేదీన మరణించారు. మరణించే నాటికి సుజాత వయసు 58 సంవత్సరాలు. సుజాత తెలుగులో నటభూషణ్ శోభన్ బాబు సరసన "గోరింటాకు", "సంధ్య" చిత్రాల్లోనూ,నటసామ్రాట్ సరసన "ఏడంతస్తుల మేడ", "సూత్రధారులు" వంటి చిత్రాల్లోనూ, దాసరి నారాయణరావు సరసన "యమ్.యల్.ఎ. ఏడుకొండలు", "సూరిగాడు" వమటి చిత్రాల్లోనూ, డాక్టర్ రాజశేఖర్ సరసన "అహంకారి" చిత్రంలోనూ ఇంకా "పెళ్ళి" చిత్రమలో కోడలి జీవితాన్ని కాపాడటానికి కన్నకొడుకునే చంపే తల్లిగా సుజాత నటించి ప్రేక్షకులను మెప్పించారు.


అలాగే "బాబా'' చిత్రంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ తల్లిగా నటించారు. 1968 లో సినీ రంగ ప్రవేశం చేసిన సుజాత సుమారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. సుజాత నటించిన ఆఖరి తెలుగు చిత్రం"శ్రీరామదాసు".ఈ చిత్రంలో సుజాత పోకల దమ్మక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అటువంటి చక్కని సీనియర్ నటి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తెలుగువన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com