Home

»

Latest News

ఆగస్ట్ లో యన్ టి ఆర్ న్యూ మూవీ రిలీజ్

Apr 6, 2011 3:27PM

tamanna hot wallpapers, tamanna hot stills, tamanna hot images, tamanna hot pics, tamanna hot   photos, tamanna hot picturesఆగస్ట్ లో యన్ టి ఆర్ న్యూ మూవీ రిలీజ్ కానుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్‍ యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ రానున్న ఆగస్ట్ లో రిలీజ్ కానుందట. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, యన్ టి ఆర్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం రానున్నఆగస్టు నెలలో రిలీజ్ అవుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ చిత్రం తొలి షెడ్యుల్ 32 రోజుల పాటు హైదరాబాద్, పఠాన్ చెరువు, ఆ తదితర ప్రాంతాల్లో జరుపుకుంది.


ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఏప్రెల్ పదహారవ తేదీ నుండి ప్రారంభం కానుంది. యన్ టి ఆర్, ఇలియానా జంటగా నటించగా ఇటీవల విడుదలైన "శక్తి" చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ఘోరమైన ఫ్లాపుగా నిలిచింది. దాంతో యన్ టి ఆర్ ఇకనుంచి తన చిత్రాలన్నీ ఇరవై కోట్ల రూపాయల సాధారణ బడ్జెట్ లోపే ఉండాలని తనతో సినిమాలను నిర్మించే నిర్మాత, దర్శకులకు కండిషన్ పెట్టబోతున్నారట. ఇది స్వాగతించాల్సిన ఒక మంచి నిర్ణయమని చెప్పవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com