నాగచైతన్య "100% లవ్" ఆడియో రిలీజ్ ఏప్రెల్ 11 న జరుగనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో అక్కినే వంశ నట వారసుడు నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యుటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై, బన్నీ వాసు నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "100% లవ్". ఈ నాగచైతన్య "100% లవ్" ఆడియో రిలీజ్ ఏప్రెల్ 8వ తేదీన జరుగుతుందనిముందుగా వినపడింది. ఆ తర్వాత ఏప్రెల్ 10 వ తేదీన,ఈ నాగచైతన్య "100% లవ్" ఆడియో రిలీజ్ జరుగుతుందని తెలిసింది.
కానీ ఇప్పుడు ఈ నాగచైతన్య "100% లవ్" ఆడియో రిలీజ్ ఏప్రెల్ 11 వ తేదీన, శిల్పారామం పక్కనే కల రాక్ గార్డెన్ నందు సాయంత్రం 6.30 గంటలకు జరుగనుందని తెలిసింది. ఏప్రేల్ 10 వ తేదీన రానా హీరోగా నటిస్తున్న "నేను - నా రాక్షసి" చిత్రం ఆడియో రిలీజ్ ఉన్నందున, ఈ నాగచైతన్య "100% లవ్" ఆడియో రిలీజ్ ఏప్రెల్ 11 వ తేదీకి మార్చినట్లు సమాచారం. కాని ఈ రెండు చిత్రాలూ అంటే నాగచైతన్య "100% లవ్", రానా "నేను - నా రాక్షసి" చిత్రాలు రెండూ ఏప్రేల్ 29 వ తేదీన విడుదల కానున్నాయి.






