నిజంగా ఇది అదృష్టమే.. మనం గుర్తించాలి అంటున్న హీరోయిన్!
on Oct 19, 2024
ప్రతి మనిషీ ఆరోగ్యంగా జీవించాలనుకుంటాడు, ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా జీవితం గడపాలనుకుంటాడు. అయితే అన్నీ మన చేతుల్లో ఉండవు అనే విషయాన్ని మర్చిపోతుంటాడు. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. అది మన నుంచి దూరంగా వెళ్లిపోయినపుడు మాత్రమే ఆ లోటు తెలుస్తుంది. ఆరోగ్యం కూడా అంతే. ఆరోగ్యంగా ఉన్నంతవరకు మనకు తిరుగు లేదు అనే భావనతో ఉంటాం. అది దూరమైనపుడు బాధపడతాం.
హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు బెడ్‌కే పరిమితం కావడంతో ఈ తత్వం బోధపడిరదట. గతవారం జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సమయంలో రకుల్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు బ్యాక్‌పెయిన్‌కి సంబంధించి సర్జరీ జరిగింది. దీంతో పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని, కదలడానికి వీలు లేదని డాక్టర్లు చెప్పారు. దాదాపు 10 రోజులుగా ఆమె బెడ్‌పైనే ఉంది. ఆ సమయంలో ఆమె మనసులో మెదిలిన ఆలోచనల్ని అందరితో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది. ‘అందరూ బాగున్నారా.. నేను కొన్ని రోజులుగా బెడ్‌పైనే ఉన్నాను. నేను గాయపడడానికి కారణం జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని అర్థమవుతోంది. త్వరలోనే కోలుకొని మళ్ళీ మీ ముందుకు రావాలని ఉంది. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అర్థమైంది. అంతేకాదు, మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం నడవగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. అయితే దీన్ని మనం గుర్తించలేకపోతున్నాం’ అంటూ ఓ పోస్ట్ పెట్టి ఫోటోలు షేర్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



