నాది ఇన్ కంప్లీట్ లవ్ స్టోరీ అంటున్న హీరో రోహిత్
on Jun 25, 2023

"లవ్ యు రామ్" మూవీ ఈ నెల 30 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ మొదలు పెట్టేసారు మూవీ హీరో హీరోయిన్స్ రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు దశరధ్ కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. టేస్టీ తేజతో కలిసి ఫుడ్ తింటూ ఈ మూవీ విషయాల మీద కాసేపు చిట్ చాట్ చేశారు హీరో హీరోయిన్స్. "దశరధ్ గారు అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది సంతోషం మూవీ ..ఆయనతో కలిసి పని చేయడం ఎలా ఉంది మీకు" అని అడిగాడు "2021 లో నా ఫస్ట్ మూవీ నాట్యం రిలీజ్ అయ్యింది. దశరధ్ గారు ఆ మూవీ చూసాక నాకు కాల్ చేసారు. నేను ఒక మూవీ తియ్యబోతున్నాను దానికి నువ్వే హీరో .. పర్ఫెక్ట్ గా సెట్ అవుతావని అన్నారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఈ మూవీలో ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశారు." అని చెప్పాడు రోహిత్.
"మీకు కూడా ఈ మూవీ ఫస్ట్ కదా తెలుగులో" అని హీరోయిన్ ని అడిగాడు. "తెలుగులో ఇదే నా ఫస్ట్ మూవీ..అంతకుముందు మలయాళంలో మేపడియన్ అనే మూవీ చేసాను. ఈ మూవీలోకి నాకు ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా అవకాశం దొరికింది. ఆయన దశరధ్ గారి గురించి చెప్పారు. నాకు అప్పటికి తెలీదు. ఆ తర్వాత గూగుల్ చేసి ఆయన ప్రొఫైల్ చూసాక అర్ధమయ్యింది." అని చెప్పారు అపర్ణ.
ఇక హీరో హీరోయిన్స్ కలిసి మూవీలోని సాంగ్ "ఉండాలని ఉంది" అంటూ పాడి వినిపించారు. " ఇక డైరెక్టర్ డీవై చౌదరి గారి గురించి చెప్పాలి ఆయన 20 ఏళ్ళ నుంచి టీవీ సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టారు. ఆయన దశరధ్ గారు మంచి ఫ్రెండ్స్. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది.. ఆ అమ్మాయిని ఫాలో అయ్యి అడ్రెస్ తెలుసుకుని వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా ఉండేవాడిని. ఇలా చాలా రోజులు చేశా..కానీ ఎప్పుడు ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి చెప్పలేదు. నాది ఇన్ కంప్లీట్ లవ్ స్టోరీ ..ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది" అని చెప్పారు రోహిత్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



