డ్రగ్స్ కేసులో దేవరకొండ అరెస్ట్.. పరారీలో నవదీప్!
on Sep 14, 2023

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తోంది. అప్పట్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది.
ఇటీవల హైదరాబాద్ లోని మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో సినీ ఫైనాన్షియర్ వెంకట్ సహా పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో హీరో నవదీప్ కి సంబంధముందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ కస్టమర్ గా ఉన్నట్టు గుర్తించామని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ని అరెస్ట్ చేశామని చెప్పారు.
కాగా, ఈ అంశంపై నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని, డ్రగ్స్ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



