హల్ బ్రదర్ మళ్లీ రీమేక్ అవుతోంది
on Mar 15, 2016
ఒక సినిమా ఓసారి రీమేక్ అయితే గ్రేట్. కానీ మళ్లీ మళ్లీ రీమేక్ అయితే..? హల్ బ్రదర్ ఇలాంటి కేటగిరీలోకే వస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం కింగ్ నాగార్జున డబుల్ ఫోజ్ లో యాక్ట్ చేసిన సినిమా ఇది. దర్శకుడు ఇవివికి, కింగ్ నాగ్ కు కెరీర్లో మరిచిపోలేని సినిమా. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి, సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాంతో హిందీలో జుడ్వా పేరుతో సల్మాన్ ను హీరోగా పెట్టి డేవిడ్ ధావన్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా సూపర్ హిట్టే. ఇప్పుడు అదే మూవీని మళ్లీ తన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కించాలనుకుంటున్నాడు డేవిడ్ ధావన్. అంటే హిందీలో మళ్లీ తర్వాత ' మళ్లీ ' రీమేక్ అవుతోందన్నమాట. ప్రస్తుతానికి మూవీకి క్యాస్టింగ్ లో బిజీగా ఉన్న డేవిడ్ త్వరలోనే షూట్ కు కూడా వెళ్లబోతున్నాడు. మన తెలుగు సినిమా ఇంతకాలం తర్వాత కూడా మళ్లీ రీమేక్ అవుతోందంటే, అలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేసిన కీ .శే ఇవివి, కింగ్ నాగ్ లను మెచ్చుకోవాల్సిందే.
Also Read