నితిన్ మళ్లీ ప్రొడ్యూస్ చేస్తున్నాడట
on Mar 15, 2016
హీరోగా చేస్తూ సినిమాల్ని నిర్మిస్తున్నాడు నితిన్. శ్రేష్ఠ్ మూవీస్ పేరుతో వరసగా ఇష్క, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి హిట్ సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన నితిన్, అక్కినేని అఖిల్ మొదటి సినిమాతో ఘోరంగా దెబ్బ తిన్నాడు. ఆ సినిమా ఇచ్చిన స్ట్రోక్ కి, ఇప్పట్లో నితిన్ సినిమా తీయడని అనుకున్నారు సినీజనాలు. కానీ నితిన్ మాత్రం ధైర్యంగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. గుండె జారి గల్లంతయ్యిందే లాంటి హిట్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో, తను హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి బయటి ప్రొడక్షన్లో ఈ సినిమా చేయాల్సి ఉన్నా, కథ చాలా బాగుండటంతో, తను రికవర్ అవటానికి ఈ సినిమా హెల్ప్ అవుతుందని నితిన్ భావిస్తున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ అ..ఆ సినిమాతో బిజీగా ఉన్న నితిన్, ఆ తర్వాత ఈ సినిమాపై దృష్టి పెడతాడని సమాచారం.