హెబ్బా ఐటమ్ సాంగ్ చేయాలంటే...
on Mar 21, 2020

'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ ఐటమ్ సాంగ్ కథలో భాగంగా ఉండాలి. అలాగే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే... ఫన్ సాంగ్ అయ్యి ఉండాలి. ఐటమ్ సాంగ్ నుండి ఆమె కోరుకునే రెండు విషయాలు అవే. రామ్ పోతినేని డ్యూయల్ రోల్‌లో యాక్ట్ చేస్తున్న 'రెడ్'లో హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్ చేశారు. ఆమె చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. అయితే... ఐటమ్ సాంగ్ చేయమని వచ్చిన ఫస్ట్ ఆఫర్ మాత్రం ఇది కాదు.
"గతంలో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ, నేను కథలో భాగంగా వచ్చే ఫన్ సాంగ్ చేయాలని అవి చేయలేదు. రామ్ సినిమాలో పాట కథలో భాగంగా వస్తుంది. ఫన్నీగా ఉంటుంది. అందుకే చేశా" అని హెబ్బా పటేల్ అన్నారు. ఇండస్ట్రీలో వన్నాఫ్ ది బెస్ట్ డ్యాన్సర్స్‌లో ఒకరైన రామ్‌తో డ్యాన్స్ చేయడానికి మొదట్లో భయపడినా... రామ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాను కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకున్నారని హెబ్బా పటేల్ చెప్పారు. హీరోయిన్‌గా మంచి ఆఫర్స్ కోసం చూస్తున్నానని అన్నారామె.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



