నాగ్ సినిమాలో వెంకటేశ్వరస్వామి ఇతడే..!
on Jun 11, 2016
.jpg)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నాగార్జున కాంబోలో హాథీరాం బాబా కథ తెరకెక్కుతోంది. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి మంచి పేరు సంపాదించుకున్నాయి. ఇప్పుడు హాథీరాం బాబా కథ కూడా అదే స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్ర కీలకం. అన్నమయ్య టైం లో భగవంతుడి పాత్రను సుమన్ పోషించారు. ఆ సినిమాలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. తర్వాత వచ్చిన రామదాసులో రాముడి పాత్ర కూడా సుమనే వేశారు. అయితే ఇప్పుడు రాబోతున్న సినిమాకు మాత్రం బాలీవుడ్ లో కృష్ణుడు, విష్ణుమూర్తి పాత్రలకు పేరు తెచ్చుకున్న సౌరభ్ రాజ్ జైన్ ను తీసుకుంటున్నారని సమాచారం. సంప్రదించగానే సౌరభ్ కూడా ఆనందంగా ఒప్పుకున్నాడట. శ్రీనివాసుడి పాత్రలో సౌరభ్, భక్తుడు హాథీరాం పాత్రలో నాగ్ అలరించనున్నారు. దేవుడి పాత్రలో ఆకట్టుకుంటే, ఇక టాలీవుడ్ లో కూడా కొత్త దేవుడికి ఆఫర్లు క్యూ కట్టడం కన్ఫామ్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



