
సెల్ఫ్ కంట్రోల్ అన్న పదంతో సమంతకు పెద్దగా పరిచయం లేదేమో?? తన నోటి నుంచి ఓ మాట వచ్చేముందు ఆలోచించడం ఇంకా అబ్బలేదేమో?? అందుకే సమంత ఎప్పుడూ హాట్ హాట్ కాంంట్రవర్సీలకూ, కామెంట్లకూ కేరాఫ్ అడ్రస్ అవుతుందటుంది. వన్ - నేనొక్కడినే సినిమా పోస్టర్ విషయంలో అలానే మహేష్ బాబు ఫ్యాన్స్‌తో గొడవ పెట్టుకొంది. సిద్దార్థ్‌తో ప్రేమాయణం మనసులో ఉంచుకోలేక బయటకు కక్కేసింది. మొన్నటికి మొన్న నేను సింగిల్ అని ఎవరు చెప్పారంటూ.. ఇండ్రస్ట్రీలో మరో హాట్ టాపిక్‌కు తెర లేపింది. ఇప్పుడు `అండర్ వేర్` గురించి నోరు జారి పరువు పోగొట్టుకొంది. ట్విట్టర్‌లో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం సమంతకు అలవాటు. అలా ఓ అభిమాని మీరు బయటకు వెళ్లేటప్పుడు మర్చిపోకుండా తీసుకెళ్లే వస్తువులేవి? అని అడిగితే... స్ర్కిన్ కేర్ ఐటెమ్స్, మెడికేషన్, గుడ్ అండర్ వేర్ అంటూ ట్వీట్ చేసింది. దాంతో ట్వీట్టర్ ప్రపంచం నివ్వెరపోయింది.
లో దుస్తుల గురించి ఇంత బహిరంగంగా మాట్లాడిన టాలీవుడ్ హీరోయిన్ సమంతేనేమో!! అభిమానులతో ఇలాంటి విషయాలు కూడా పంచుకొంటారా అంటూ టాలీవుడ్ కూడా సమంత ఆన్సర్ కు షాకైపోతోంది. సమంత ఏదో ఇరిటేషన్‌లో ఆ ఆ ట్వీటు చేసుంటుందేమో అని సమర్థిస్తున్నవాళ్లు ఉన్నారు. ఆడియో ఫంక్షన్లకు కొంతమంది హీరోయిన్లు లోదుస్తులు లేకుండా హాజరవ్వడం, ఆ విషయాన్ని కొంతమంది ఫొటోగ్రాఫర్లు తమ ఫొటోగ్రఫీ ట్రిక్కుతో బయటపెట్టడం, ఆ తరవాత సదరు ఫొటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆ ప్రమాదం తన విషయంలో ఎదురవ్వకూడన్న ఉద్దేశంతోనే సమంత ఇలా ట్వీట్ చేసిందేమో అన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అయితే `సమంత సిగ్గు లేకుండా మాట్లాడిందేంటి` అని నివ్వెరపోతున్నవాళ్లే ఎక్కువ. ఏదేమైనా సమంత సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకొంటే మంచిది. లేదంటే ఇలాంటి ఉపద్రవాలే ఎదుర్కోవాల్సి వస్తుంది.






