'శ్రీమంతుడు' విలన్ రెండో పెళ్లి!
on Jan 21, 2022
పలు తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా నటించి, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హరీశ్ ఉత్తమన్ గురువారం మలయాళం నటి చిన్నుకురివిలాను పెళ్లాడాడు. అలప్పుళ జిల్లాలోని మావలిక్కర రిజిస్ట్రార్ ఆఫీసులో వారి వివాహం జరిగింది. ప్రత్యేక వివాహ చట్టం కింద వారి వివాహాన్ని రిజస్టర్ చేశారు.
Also read: చైతూతో విడాకుల పోస్ట్‌ను తొలగించిన సామ్.. ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా?
పవర్, జిల్, శ్రీమంతుడు, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణగాడి వీరప్రేమగాథ, దువ్వాడ జగన్నాథమ్, జై లవకుశ, నా పేరు సూర్య, వినయ విధేయ రామ, నాంది తదితర చిత్రాలలో చేసిన నెగటివ్ రోల్స్‌తో హరీశ్ ఉత్తమన్ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం మమ్ముట్టి మలయాళం చిత్రం 'భీష్మ పర్వం'లో నటిస్తున్నాడు. కాగా, నార్త్ 24 కథమ్, కసబ, లుక్కా చుప్పి వంటి చిత్రాలు చిన్ను కురువిలాకు మంచి పేరు తెచ్చాయి.
Also read: ధనుష్, ఐశ్వర్యను కలిపేందుకు రజనీ విఫలయత్నం!
హరీశ్‌కు ఇది రెండో వివాహం. ఇదివరకు 2018లో మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌పుర్‌ను పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి మధ్య కలతలు చెలరేగడంతో ఏడాదికే విడిపోయారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
