నువ్వెంత హార్డ్ వర్క్ చేసావో నాకు తెలుసు!
on Jun 10, 2023
"నా పేరు మీనాక్షి" సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య స్వామి. ఆమె నటించిన "ఇంటింటి రామాయణం" మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. పల్లెటూరు నేపథ్యంలో సాగా ఒక ఫ్యామిలీ డ్రామా.. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్, గంగవ్వ, బిత్తిరి సత్తి, అంజి తదితరులు కీలక పోషించారు. ఈ మూవీ రిలీజ్ ఐన సందర్భంగా హరితేజ నవ్యస్వామికి విషెస్ చెప్తూ ఒక పోస్ట్ పెట్టింది..."నువ్వు ఎదుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ప్యాషన్ కోసం నువ్వెంత హార్డ్ వర్క్ చేసావో నేను చూసాను. నాకు చాల గర్వంగా ఉంది. కుల్లి నువ్వు చాలా మంచి పని చేసావ్..ఇది ఆరంభం మాత్రమే..గుడ్ లక్" అంటూ ఇంటింటి రామాయణం మూవీ పోస్టర్ తో సహా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది హరితేజ...నవ్య స్వామి ప్రస్తుతానికి సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చి మూవీస్ లో చేయాలని డిసైడ్ అయ్యాక ఈ మూవీ ఆఫర్ రావడం ఆడిషన్ లో ఈ పాత్రకు తాను సెట్ అవడంతో డైరెక్టర్ ఓకే చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నవ్యస్వామి.
బుల్లితెర మీద "నా పేరు మీనాక్షి" సీరియల్ మంచి సక్సెస్ అయ్యాక 'ఆమె కథ' అనే సీరియల్ ప్రసారమయ్యింది. ఈ సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ లో రవికృష్ణతో కలిసి నటించింది నవ్య స్వామి. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ మీద కూడా మేజిక్ చేసింది. కానీ తాము లవర్స్ కాదు అని ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పింది. ఈ మధ్యకాలంలో నవ్య స్వామి వెబ్ సిరీస్, మూవీస్ తో బిజీగా మారిపోయింది. 'బుట్ట బొమ్మ' మూవీతో ఆడియన్సుని అలరించి ఇప్పుడు 'ఇంటింటి రామాయణం' తో వచ్చేసింది. భవిష్యత్తులో మంచి ఆఫర్స్ వస్తే తాను రవికృష్ణతో కలిసి నటించడానికి సిద్దమే అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నవ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్ డేట్స్ అన్నిటినీ ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
