అల్లు అర్జున్ క్లోజ్ చేసింది పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నాడా!
on Jul 17, 2025
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara Veeramallu)ఈ నెల 24 న విడుదల కానున్న విషయం తెలిసిందే. 'బ్రో' వచ్చిన రెండేళ్లకి పవన్ నుంచి వస్తున్న మూవీ వీరమల్లునే. దీంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో 'వీరమల్లు' పై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచనున్నారు. అందులో భాగంగా ఈ నెల 20 న 'వైజాగ్' లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli)ముఖ్య అతిధిగా రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్(Allu Arjun)రీసెంట్ హిట్ 'పుష్ప 2' (Pushpa 2)బెనిఫిట్ షో కి అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, హైదరాబాద్ లో ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై తెలంగాణాలో బెనిఫిట్ షోస్ ఉండవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయం తర్వాత అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందు రోజు నైట్ కానీ,రిలీజ్ రోజు తెల్లవారుజామున గాని బెనిఫిట్ షోస్ అనేవి పడలేదు. మరి ఇప్పుడు 'వీరమల్లు' రిలీజ్ సందర్భంగా తెలంగాణాలో బెనిఫిట్ షో గురించి ఫ్యాన్స్ లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలు తెలంగాణాలో 'బెనిఫిట్ షో'లు జరుపుకున్నాయి. ఫ్యాన్స్ కూడా అందరి కంటే ముందుగా పవన్ మూవీని చూడాలనే నేపథ్యంలో, బెనిఫిట్ షో ఉండాలని కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో బెనిఫిట్ షో కోసం ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరమల్లు బెనిఫిట్ షో పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పుష్ప 2 తో రద్దయిన బెనిఫిట్ షో వీరమల్లు తో పవన్ ప్రారంభిస్తాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత ఏ ఎం రత్నం అయితే ఇటీవల సి ఎం రేవంత్ రెడ్డి ని కలిసాడు.
ఇక వీరమల్లు లో పవన్ సరసన 'నిది అగర్వాల్'(Nidhhi Agerwal)పంచమి అనే క్యారక్టర్ లో చేస్తుంది. రిలీజ్ టైం దగ్గరపడేకొద్దీ ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొని మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెప్తూ వస్తుంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన వీరమల్లు పవన్ కెరీరి లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన సాంగ్స్ కూడా ప్రేక్షకాదరణ పొందాయి. యానిమల్ విలన్ బాబీ డియోల్ ఔరంగజేబుగా చేస్తుండగా రఘుబాబు, అనసూయ, నర్గిస్ ఫక్రి, నౌరా ఫతేహి జిష్ణు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
