'హరి హర వీరమల్లు' నుంచి కీలక అప్డేట్.. తొందరపడితే చరిత్రను తిరగరాయలేం
on Nov 24, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ నెమ్మదిగా సాగుతుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అభిమానులు సైతం ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాము వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికే ఇంత సమయం తీసుకుంటున్నామని, మా ఈ ప్రయాణంలో మీరంతా మద్దతుగా నిలవాలని కోరుతూ తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
"చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 'హరి హర వీరమల్లు' ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం." అంటూ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రెస్ నోట్ లో పేర్కొంది. అలాగే చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా పంచుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



