Home

»

Latest News

వివాదంలో హ‌న్సిక సినిమా!!

Dec 13, 2018 2:53PM

కొన్ని వివాదాలు కొన్ని సినిమాల‌కు విప‌రీత‌మైన ప‌బ్లిసిటీని తీకొస్తాయి. మ‌రికొన్ని సినిమాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. అలాంటి వివాదంలో చిక్కుకుంది హ‌న్సిక న‌టిస్తోన్న 50వ సినిమా. ఇటీవ‌ల `మ‌హా` చిత్రంలోంచి   స‌న్యాసులు ధ‌రించే కాషాయ వ‌స్త్రాలను ధ‌రించి , సింహాస‌నం లాంటి కుర్చిలో కూర్చోని హుక్కా తాగుతున్న‌ట్లుగా  హ‌న్సిక స్టిల్  ను ఫ‌స్ట్ లుక్ గా రిలీజ్ చేసారు  ద‌ర్శ‌క నిర్మాత‌లు.  అయితే ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ హిందువుల మ‌నోభావాల‌నుకించ‌ప‌రిచే విధంగా ఉందంటూ వివాదానికి గురైంది. ఇప్ప‌టికే దీనిపై  పీయంకే పార్టీ కోర్టులో కేసు  కూడా  వేసింద‌ట‌.  కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌డంతో సినిమా భ‌విష్య‌త్ ఎలాం ఉండ‌బోతుందోనన్న ఆస‌క్తి మొద‌లైంది.

ఇది హ‌న్సిక న‌టిస్తోన్న   50 వ సినిమా కావ‌డంతో  ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇలా వివాదాస్ప‌దం కావ‌డంతో చిత్ర యూనిట్ షాక్ కి గురైంది.   ఈ సినిమా ద్వారా ఆర్‌.జెమ‌ల్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచయం కాబోతున్నాడు. మ‌రి ఈ వివాదం హ‌న్సిక‌కు క‌లిసొస్తుందో లేక ఇబ్బందుల పాలు చేస్తుందో చూడాలి మ‌రి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com