Home

»

Latest News

ఫుల్‌గా న‌వ్వించే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌!!

Dec 13, 2018 1:22PM

`ఎఫ్ 2` టైటిల్ విన‌డానికే చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ఇక వెంకీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ కూడా టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా ఫ‌న్ అండ్ పెళ్లాల పై ఫ్ర‌స్టేష‌న్ తో ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది. సంక్రాంతికి రాబోయే ఈ కొత్త అల్లు ళ్లు ఎంత‌గా న‌వ్వించ‌బోతున్నారో ఈ టీజ‌ర్లో చూపించాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. వెంక‌టేష్ , వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.  ఈ టీజ‌ర్ చూశాక పెళ్లి, పెళ్లాల చుట్టూ తిరిగేలా సినిమా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.   

 `ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం. .. అదే ఒక మ‌గాడి గురించి చెప్పాలంటే పెళ్ళికి ముందు పెళ్ళికి త‌ర్వాత అంటూ `` వెంక‌టేష్ త‌న స్టైల్ లో చెప్పి ఆక‌ట్టుకున్నాడు. అలాగే వ‌రుణ్ తేజ్ కూడా `` ఒక చరిత్ర గురించి చెప్పాలంటే తెలంగాణా రాక‌ముందు...తెలంగాణా వ‌చ్చాక అంటూ``తెలంగాణా యాస‌లో చెప్పి ఆక‌ట్టుకున్నాడు.  టీజ‌ర్ చూశాక వెంకీ, వ‌రుణ్ ల కెమిస్ట్రీ బాగానే కుదిరిన‌ట్టుగా అనిపించింది.  ఈ ఇద్ద‌రి హీరోల టైమింగ్ బాగా కుద‌ర‌డంతో టీజ‌ర్ మొత్తం న‌వ్వుల‌తో నిండిపోయింది.  ఇటీవ‌ల కాలంలో వెంకీ త‌ర‌హా కామెడీ టైమింగ్ తో సినిమాలు రాలేదు. ఈసినిమాలో వెంకీని ఫుల్ గా అనిల్ రావిపూడి వాడినట్టు తెలుస్తోంది.  ఇక ప్ర‌తి సినిమాలో ఏదో ఒక మ్యాన‌రిజ‌మ్ ఉండే డైలాగ్ పెట్టే ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో కూడా అంతేగా ...అంతేగా అంటూ టీజ‌ర్ ని ఎండ్ చేశాడు. ఇది సినిమాలో బాగానే వ‌ర్క‌వుట్ అయ్యేలా అనిపిస్తోంది.  వ‌రుస హిట్స్ తో దూసుకెళ్తోన్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి రాజాది గ్రేట్ త‌ర్వాత దిల్ రాజు బేనర్ లో చేసిన చిత్ర‌మిది.  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఎఫ్ 2 వ‌స్తోంది.  దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రం ఆడియో త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com